Abn logo
Nov 28 2020 @ 01:20AM

రోడ్ల విస్తరణ, మరమ్మతులకు రూ.47.7 కోట్లు

సర్పవరం జంక్షన్‌ (కాకినాడ), నవంబరు 27: జిల్లాలో పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది, రోడ్ల విస్తరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ-సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (సీ ఆర్‌ఐ ఎఫ్‌) పథకం కింద జిల్లాకు రూ.47.70 కోట్ల నిధులు మంజూరు చేస్తూ శుక్ర వారం ప్రభుత్వ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మా మిడికుదురు నుంచి అప్పన్నపల్లి-పెదపట్నంలంక వరకు 8.8 కిలోమీటర్ల మేర, పుల్లేటికురు-అంబాజీపేట రోడ్డు 1.20 నుంచి 6.420 కి.మీ, మానేపల్లి-పెదపట్నం రోడ్డు 2.230 కి.మీ మొత్తంగా 10.750 కి.మీ మేర రోడ్ల విస్తరణ, మరమ్మతు  పనుల కోసం రూ.23 కోట్లు మంజూరు చేసింది. అనంతవరం-పల్లంకుర్రు రోడ్డు విస్తరణ పనుల కోసం కేటాయించిన రూ.19 కోట్ల పనులకు బదులుగా పై రోడ్ల విస్తరణ కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంజూరైన పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

Advertisement
Advertisement
Advertisement