రోడ్డు ప్రమాదాల నివారణపై..

ABN , First Publish Date - 2021-01-21T05:29:30+05:30 IST

రోడ్డు భద్రత నియమాలపై బుధవారం పోలీసులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై..
జూపాడుబంగ్లాలో ర్యాలీ

  1.  అవగాహన ర్యాలీలు నిర్వహించిన పోలీసులు


జూపాడుబంగ్లా, జనవరి 20: రోడ్డు భద్రత నియమాలపై బుధవారం పోలీసులు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని ఏఎస్‌ఐ జయన్న అన్నారు. బుధవారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జూపాడుబంగ్లాలో కేజీ రోడ్డుపై విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. 


చాగలమర్రి: రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆళ్లగడ్డ రూరల్‌ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చాగలమర్రి గ్రామంలో వాసవీ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, పోలీసులు కలిసి 32వ జాతీయ రహదారి ఉత్సవాల ర్యాలీ చేశారు. గాంధీ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. 


ఆత్మకూరు: రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సీఐ బీఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం 32వ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసుశాఖ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు, వాహన చోదకులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  సీఐ బీఆర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ.. దేశంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. రహదారి భద్రత జీవితానికి రక్ష అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఎస్సై ఓబులేసు ఉన్నారు. 


దొర్నిపాడు: రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు ఎస్‌ఐ కీర్తి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ కీర్తి మాట్లాడుతూ ఆళ్లగడ్డ కేవీ సుబ్బారెడ్డి విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై ప్లకార్డుతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐలు బాలచంద్రుడు, ప్రతాప్‌రెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. 


సంజామల: రోడ్డు భద్రతపై బుధవారం సంజామలలో ర్యాలీ చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఎస్‌ఐ తిమ్మారెడ్డి, పోలీసులు ర్యాలీలో పాల్గొన్నారు. వాహనదారులు రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నినాదాలు చేశారు. హెల్మెటు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలన్నారు. 

Updated Date - 2021-01-21T05:29:30+05:30 IST