సందడిగా రహదారి భద్రత మాసోత్సవాలు

ABN , First Publish Date - 2021-01-21T05:26:31+05:30 IST

రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా స్థానిక బంక్‌ కూడలిలో ట్రాఫిక్‌ సీఐ డి.శ్రీహరిరాజు ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది.

సందడిగా రహదారి భద్రత మాసోత్సవాలు
గోపాలపట్నంలో ప్లకార్డులతో అవగాహన కల్పిస్తున్న సీఐ, పోలీసులు

గోపాలపట్నం, జనవరి 20: రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా స్థానిక బంక్‌ కూడలిలో ట్రాఫిక్‌ సీఐ డి.శ్రీహరిరాజు ఆధ్వర్యంలో  బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్‌ నియమాలపై అవగాహనతో పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాల నియంత్రణ సాఽధ్యమన్నారు. సెల్‌పోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం, మితిమీరిన వేగం, కిక్కిరిసిన ప్రయాణికులతో వాహనాలు నడపడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. ప్రతి ఒక్క రూ ట్రాఫిక్‌ నిబంధనల్ని పాటించి ప్రమాదాల్ని అరికట్టాలన్నారు. ఈ సందర్భంగా ఫ్లకార్డులు ప్రదర్శించి ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కె.వెంకటరావు, పోలీసులు పాల్గొన్నారు.


భద్రతా నియమాలను పాటించాలి

లంకెలపాలెం: రహదారి భద్రతా నియమాలను పాటించినప్పడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని స్టీల్‌ప్లాంట్‌ ట్రాఫిక్‌ సీఐ ఈశ్వరరావు పేర్కొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని  లంకెలపాలెం శాంతి టాలెంట్‌ పాఠశాల విద్యార్థులకు  అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేయకూడదన్నారు. ఎస్‌ఐ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్‌ బొండా వెంకటశ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T05:26:31+05:30 IST