రహదారి భద్రత అందరి బాధ్యత

ABN , First Publish Date - 2021-01-21T06:44:11+05:30 IST

రహదారి భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహక రించాలనీ డీఎస్పీ ఎన్‌ సత్యానందం పేర్కొన్నారు.

రహదారి భద్రత అందరి బాధ్యత
3కె వాక్‌ ప్రారంభిస్తున్న డీఎస్పీ సత్యానందం

గుడివాడ(రాజేంద్రనగర్‌), జనవరి 20 : రహదారి భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌   నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహక రించాలనీ  డీఎస్పీ ఎన్‌ సత్యానందం పేర్కొన్నారు.   జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని ఎన్టీఆర్‌ స్టేడియంలో  3కె వాక్‌ను బుధవారం నిర్వహించారు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విజేతలకు బహుమతులు అందించారు.  ఒన్‌టౌన్‌ సీఐ కె గోవిందరాజు, ట్రాఫిక్‌ ఎస్సై   రామకృష్ణ, కోచ్‌  వెంకటేశ్వరరావు, వాకర్స్‌ నేత లోయ ఈశ్వరవెంకటేశ్వరరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యంతోనే కుటుంబాలు ఛిన్నాభిన్నం

గుడ్లవల్లేరు :  వాహనదారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాల్లో  ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి కొందరి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని  గుడివాడ మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌  మురళీకృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భ్రదతా మాసోత్సవాల సందర్భంగా  గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో రోడ్డు భద్రపై   అవగాహనా సదస్సులో మురళీకృష్ణ మాట్లాడారు.  మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ప్రసాద్‌, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ పి. కోదండ రామారావు, శాస్ర్తి తదితరులు పాల్గొన్నారు. కోడూరు: జాతీయ రోడ్డు భద త్రా మాసోత్సవాలల్లో  ప్రధాన సెంటర్‌ వద్ద మారుతి జూనియర్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్సై పి.రమేష్‌ అవగాహన కల్పించారు.  మానవహారం నిర్వహించారు. పోలీసు సిబ్బంది, మారుతి జూనియర్‌ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. చల్లపల్లి : జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం చల్లపల్లిలో రహదారి భద్రతపై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఎస్సై పి.నాగరాజు, ఏఎస్సైలు లక్ష్మణరాజు, సుబ్బారావు సిబ్బంది అవగాహన కల్పించారు.  అతివేగం - ప్రమాదకరం, రోడ్డు ప్రమాదాలను నివారించండి, కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడుకోవాలని సూచించారు. 





Updated Date - 2021-01-21T06:44:11+05:30 IST