రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-21T05:48:34+05:30 IST

పట్టణంలోని జలా ల్‌ పెట్రోలు బంకు నుంచి పాత బస్టాండ్‌లోని అంబేద్కర్‌ చౌక్‌ వరకు నిర్మించనున్న రహదారి విస్తరణ పనులను మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా ప్రారంభిం చారు

రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

చెన్నూరు, అక్టోబరు 20 : పట్టణంలోని జలా ల్‌ పెట్రోలు బంకు నుంచి పాత బస్టాండ్‌లోని అంబేద్కర్‌ చౌక్‌ వరకు నిర్మించనున్న రహదారి విస్తరణ పనులను మంగళవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా ప్రారంభించారు. రూ. 11 కోట్లతో రోడ్డు విస్త రణ పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. 132 పీట్ల రోడ్డు వెడల్పు చేస్తుండగా అయ్యప్ప గుడి వద్ద గర్భగుడికి నష్టం జరగ కూడదన్న కారణంతో రోడ్డును 120 ఫీట్లకు కుదించి పనులను ప్రారంభించామన్నారు. ప్రభుత్వ విప్‌ సుమన్‌ సహకారంతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. వైస్‌ చైర్మన్‌ నవాజుద్దీన్‌, కమిషనర్‌ రమేష్‌, ఏఈ సాయి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-21T05:48:34+05:30 IST