రోడ్డు పనులు నాణ్యతగా చేయాలి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-12-07T05:23:15+05:30 IST

పట్టణంలోని పెన్నానది వంతెన పక్కన తాత్కాలికంగా నిర్మిస్తున్న అప్రోచ్‌రోడ్డును నాణ్యతగా చేయా లని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారుల కు సూచించారు.

రోడ్డు పనులు నాణ్యతగా చేయాలి : ఎమ్మెల్యే
రోడ్డును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 6: పట్టణంలోని పెన్నానది వంతెన పక్కన తాత్కాలికంగా నిర్మిస్తున్న అప్రోచ్‌రోడ్డును నాణ్యతగా చేయా లని  ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అధికారుల కు సూచించారు. సోమవారం ఆయన రోడ్డు పనులను నదిలో పట్టణానికి సరఫరా చేసే బోర్లను పరిశీలించారు.  వర్షాలు బాగా కురవడం వల్ల పెన్నానదికి వరదనీరు ప్రవహించి ప్రజలందరికి ఇబ్బంది కలిగిందన్నారు. వంతెన కుంగిపోయి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వెంటనే సమస్యలు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వంతెన పనులను  త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  కార్యక్రమంలో వైసీపీ పట్టణాధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి నాయకులు కొండారెడ్డి, మార్బుల్‌ శ్రీను, పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T05:23:15+05:30 IST