రహదారి కూలి... రాకపోకలు నిలిచి

ABN , First Publish Date - 2021-09-16T05:05:55+05:30 IST

రహదారి కూలి... రాకపోకలు నిలిచి

రహదారి కూలి... రాకపోకలు నిలిచి
కూలిపోయిన వరద కాలువ రహదారి, రాకపోకలకు ఇబ్బందులు

నులకజోడు వద్ద ప్రయాణికుల పాట్లు

భామిని, సెప్టెంబరు 15: నులకజోడు వద్ద  వంశధార వరద కాలువ గుట్టుపై  రహదారి బుధవారం కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలికాం-బత్తిలి రోడ్డుకు అనుసంధానంగా నులకజోడు రోడ్డును పంచాయతీ రాజ్‌ అధికారులు గత ఏడాది నిర్మించారు. వడ్డంగి, లోహరజోల, బొమ్మిక నుంచి వర్షం నీరంతా నులకజోడు మీదుగా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో కలవడంతో నాసిరకంగా నిర్మించిన కల్వర్టులు కూలిపోయిన విషయం విదితమే. గత నెల 28న వర్షాలకు సగం రహదారి కొట్టుకుపోయింది. స్థానికులు వంశధార అధికారులకు ఫిర్యాదు చేయడంతో పరిశీలించారు.  డిజైన్‌ను అప్రూవల్‌ చేశామని, వర్షాలు తగ్గితే నిర్మిస్తామని అప్పట్లో వారు హామీ ఇచ్చారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డంతా  బుధవారం కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడ్డారు. జిల్లా, వంశధార అధికారులు స్పందించి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ ప్రసాద్‌ కోరారు.

Updated Date - 2021-09-16T05:05:55+05:30 IST