రోడ్లపై మురుగు నీరు

ABN , First Publish Date - 2021-08-02T05:36:05+05:30 IST

సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లు మురికి నీటి కాలువలుగా మారుతున్నాయి.

రోడ్లపై మురుగు నీరు
రోడ్డుపై నిలిచిన ఉన్న మురుగు నీరు

కాల్వలను తలపిస్తున్న సీసీలు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

గిద్దలూరు, ఆగస్టు 1 : సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్లు మురికి నీటి కాలువలుగా మారుతున్నాయి. పట్టణంలోని పలు శివారు ప్రాంతా ల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇళ్ల నుంచి వచ్చే మురికినీరు, అలాగే వర్షం నీరు రోడ్లపైనే నిలబడుతూ రోడ్లు గుంతలమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారుతున్నది. దీనికితోడు సిమెంటు రోడ్లు ఉన్న వీధుల్లో చాలావరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ  లేని పరిస్థితి ఉం ది. ఫలితంగా మురికి నీరు, వర్షం నీరు సి మెంటు రోడ్లపైనే నిలబడి ఉంటోంది. దీంతో బురదమయంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. కొంగళవీడు రోడ్డులో సచివాలయం సమీపంలో సరైన డ్రైనేజీ వ్యవస్థలేక మురికి నీ రంతా సిమెంటు రోడ్డుపైనే నిలబడుతున్నదని, అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఫలితం లేకుం డా పోయిందని  స్థానికులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. సిమెంటు రోడ్లపై మురికినీరు నిలబడడం వలన పాచిపట్టి దానిపై నడిచే సందర్భంలో జారి కిందపడి గాయాలపాలవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2021-08-02T05:36:05+05:30 IST