గతుకుల రోడ్లు...శిథిలమైన వంతెనలు

ABN , First Publish Date - 2021-10-24T04:58:50+05:30 IST

రోడ్డంతా గతుకులు, మలుపుల వద్ద వంతెనలు ఆపై ఛిద్రమైన రక్షణ గోడలు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించు కోవచ్చు.

గతుకుల రోడ్లు...శిథిలమైన వంతెనలు
ఇరగవరం – రాపాక మార్గంలో రక్షణగోడ లేని వంతెన

ఇరగవరం, అక్టోబరు 23: అసలే రోడ్డంతా గతుకులు, మలుపుల వద్ద వంతెనలు ఆపై ఛిద్రమైన రక్షణ గోడలు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందో ఊహించు కోవచ్చు. ఈ రహదారిలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రెప్పపాటులో ప్రమాదం ముంచుకొస్తుంది. ఇది ఇరగవ రం నుంచి రాపాక వెళ్లే మార్గంలో వంతెన పరిస్థితి. ఈ ప్రదేశాల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా యని ప్రజలు వాపోతున్నారు. ఇలాగే మండలంలోని పలు గ్రామాల్లో కాలువ వంతెనలు శిథిలావస్థకు చేరు కున్నాయి. ఈ వంతెనలపై రాత్రి వేళల్లో ప్రయాణికులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఇప్పటికైనా మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2021-10-24T04:58:50+05:30 IST