Abn logo
Nov 21 2020 @ 03:04AM

రోడ్లు బలి!

Kaakateeya

దారి పొడవునా గోతులే

మరమ్మతులకు సొమ్ముల్లేవ్‌

కేటాయించింది కేవలం 12 కోట్లు.. అందులో విడుదలచేసింది సున్నా

పాత బకాయిలే రూ.300 కోట్లు.. కొత్తగా రూ.450 కోట్లు కావాలి

కనీసం 180 కోట్లిస్తేనే మరమ్మతులు.. కేంద్రం, ఇతర పద్దుల కిందే పనులు

రోజువారీ రోడ్ల నిర్వహణ అధ్వాన్నమ్‌ధ.. గుంతలతో అందరికీ అగచాట్లు


రోడ్లపై గుంతలుండడం కాదు! గుంతల్లోనే అక్కడక్కడా రోడ్లున్నాయ్‌! ఇదీ రాష్ట్రంలో రహదారుల పరిస్థితి! రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. ప్యాచ్‌ వర్కులు చేయకుండా వదిలేస్తే... మొత్తం రోడ్డే నాశనమైపోతుంది. మళ్లీ కొత్త రోడ్డు వేయాల్సి వస్తుంది. అది ఖజానాకు పెను భారమవుతుంది. అందుకే... ప్రతిఏటా రోడ్ల మరమ్మతుల కోసం రూ.350 కోట్లు కేటాయిస్తారు. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కూడా విడుదల చేస్తారు. కానీ.. ఈ ఏడాది సీన్‌ రివర్స్‌. రూ.350 కోట్లకు బదులు కేవలం 12 కోట్లు కేటాయించారు. అందులో పన్నెండు రూపాయలు కూడా విడుదల చేయలేదు. మరి... రోడ్లు ఎలా బాగుంటాయి? 


 అమరావతి,  నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):‘‘రాష్ట్రంలోని రహదారులపై గుంతలు లేకుండా చేస్తాం! వచ్చే ఏడాదినాటికి ప్రమాదాలను 15ు తగ్గిస్తాం! జిల్లా ప్రధాన రహదారులను 500 కి.మీ.మేర అభివృద్ధిచేసి విస్తరిస్తాం! ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) ప్రమాణాలకుఅనుగుణంగా రహదారులను తీర్చిదిద్దుతాం’’ అని బడ్జెట్‌లో ఘనంగా ప్రకటించారు. ఇదంతా నిజమవుతుందని జనం  సంతోషించారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటో తె లుసా... కనీసం రోడ్ల రిపేర్లకు కూడా రూపాయి విదల్చడం లేదు. రూ.2వేల కోట్లతో రహదారుల మరమ్మతులు, అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ సీఎం జగన్‌ గతనెలలో ఆదేశాలిచ్చారు. కానీ.. సొ మ్ముల్లేవు. పాత బకాయిలు చెల్లించడానికే ని ధులు లేవు. ఇక రిపేర్లు, ప్యాచ్‌ వర్క్‌లు చే యడానికి డబ్బులెక్కడివి? ప్రత్యేకంగా ఎక్కడినుంచైనా నిధులు తీసుకొస్తే తప్ప రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు కూడా చేయలేని పరిస్థితి  నెలకొంది. రహదారుల అభివృద్ధి, నిర్వహణ కో సం పెట్రోల్‌, డీజీల్‌పై సెస్సు వసూలు చేస్తున్నప్పుడు, దెబ్బతిన్న రోడ్లను ఎందుకు బాగుచేయరని ప్రశ్నించే హక్కు సగటు పౌరుడికి ఉండటం సహజమే! కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం రహదారుల మరమ్మతులు చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. 


ఏడాదిన్నరగా అంతే... 

రాష్ట్రంలో 14,714 కి.మీ. మేర రాష్ట్ర ప్రధాన రహదారులు(స్టేట్‌ హైవే) ఉన్నాయి. 32వేల కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్‌) ఉన్నాయి. గతంలో రహదారుల నిర్వహణకు మెయింటెనెన్స్‌, రిపేర్ల కింద ఏటా రూ.150 కోట్ల నిధులు కేటాయించేవా రు. రెగ్యులర్‌గా వచ్చే రిపేర్లతోపాటు అకాల వర్షాలు, వరదలు, తుఫానుల కారణంగా రోడ్లు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చే యించడానికి ఈ నిధులు ఉపయోగించేవా రు. దీనికితోడు రహదారుల మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ను నిర్వహించేవారు. ఏడాదిన్నర కా లంగా మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ నిలిచిపోయిం ది. గతంలో చేపట్టిన రోడ్‌ రిపేర్‌, ఇతర పనులకు సంబంధించి రూ.220 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. వాటికోసం కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనికితోడు ఈ ఏడాది కాలంలో అధికారిక లెక్కల ప్రకారమే 3,800 కి.మీ. మేర రో డ్లు దెబ్బతిన్నాయి.


ఇటీవలి వర్షాలతో దెబ్బతి న్న రోడ్లు మరో 1600కి.మీ. మేర ఉన్నాయి. వాటిల్లో భారీగా మరమ్మత్తులు చేపట్టాల్సినవి 1,300 కి.మీ. మిగిలిన రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు చేసినా సరిపోతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రిపేర్లు, ప్యాచ్‌వర్క్‌లకు కలిపి రూ.450 కోట్ల అవసరం అవుతాయని ఆర్‌అండ్‌బీ అంచనావేసింది. తక్షణ మరమ్మత్తుల కోసం రూ.180 కోట్లు కావాలని ప్రభుత్వానికి నివేదించింది. గత రెండు నెలల్లో రహదారి రిపేర్లు, మెయింటెనెన్స్‌ అంశంపై ప్రభుత్వ స్థాయిలో నాలుగు సమావేశాలు జరిగాయి. ప్రతీ సమావేశంలోనూ రిపేర్‌ పనులకు మీకు ఎంత కావాలి? మీ దగ్గర లేవా? అన్న ప్రశ్నేలే ఎదురవుతున్నట్లు తెలిసింది. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? రెగ్యులర్‌గా కేటాయించే మెయింటెనెన్స్‌ నిధులు ఏమైనట్లు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


అన్నీ కేటాయింపులే...: 2020-21 బడ్జెట్‌లో రహదారి నిర్వహణ కోసం కేటాయించిన నిధులు రూ.100 కోట్లు. కానీ అందులో నుంచి విడుదల చేసిందేమీలేదని తెలిసింది. ఇక వరదలు, విపత్తులు వచ్చినప్పుడు తక్షణ అవసరాలకోసం రూ.15.19 కోట్లు కేటాయించారు. జాతీయ రహదారులకు రెగ్యులర్‌ రిపేర్ల కోసం రూ.36 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కేటాయింపులే. విడుదల అత్తెసరుగానే ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రిపేర్లకోసం ఇచ్చింది రూ.20 కోట్లే అని తెలిసింది. తక్షణమే రూ.180 కోట్లు విడుదల చేస్తే తప్ప రాష్ట్ర రహదారులపై గుంతలు పూడ్చడం, ప్యాచ్‌వర్క్‌లు, బ్రిడ్జి రిపేర్‌ పనులు చేపట్టడం కష్టమని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు.


కానీ.. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అన్ని నిధులు వచ్చే అవకాశం ఉందా? అని అధికారులే సందేహిస్తున్నారు. మరి వాహనదారుల పరిస్థితి ఏమిటి? అంటే దైవాదీనమే! ప్రభుత్వం సొమ్ముల్లివ్వకుండా ఆర్‌అండ్‌బీ రోడ్లపై గుంతలు పూడ్చలేదు. ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించడం లేదని తెలిసి కూడా తక్షణ రిపేర్లు చేయడానికి ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదు. జగనన్న కానుకల పేరిట వివిధ పథకాల కింద నగదు బదిలీ చేపడుతున్న సర్కారుకు పెద్దపెద్ద గోతులతో మినీ బావులను తలపిస్తున్న రహదారులు గుర్తుకురావడం లేదా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెట్రోల్‌, డీజీల్‌పై వసూలు చేసే సెస్సుతోనైనా రోడ్లు రి పేరు చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement