ఈ రోడ్డులో ప్రయాణించేదెలా?

ABN , First Publish Date - 2020-12-03T04:20:59+05:30 IST

మండలంలోని మోరగుడి క్రాస్‌ రోడ్డు వద్ద నుంచి కర్నూలు వెళ్లే జాతీయ రహదారి గుంతలమయమైంది.

ఈ రోడ్డులో ప్రయాణించేదెలా?
జమ్మలమడుగులో గుంతలు పడిన జాతీయ రహదారి

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 2: మండలంలోని మోరగుడి క్రాస్‌ రోడ్డు వద్ద నుంచి కర్నూలు వెళ్లే జాతీయ రహదారి గుంతలమయమైంది. మూడురోడ్ల కూడలి వద్ద నుంచి అక్కడక్కడా ప్రధాన రోడ్డు గుంతలు పడి ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి ప్రధాన రోడ్డు గుంతల్లో నీరు నిలిచింది. గత ఏడాది నుంచి స్థానికులు, వాహనదారులు రోడ్డు మరమ్మతులు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. రాత్రి సమయాల్లో కరెంటు లేనప్పుడు ద్విచక్ర వాహనదారులు, ఇతర వాహనదారులు, నడిచి వెళ్లే బాటసారులు గుంతల్లో పడి గాయపడుతున్నారు. మోరగుడి వద్ద నుంచి ఎస్‌.ఉప్పలపాడు, గుండ్లకుంట, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రధాన రోడ్డు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-12-03T04:20:59+05:30 IST