Abn logo
Sep 12 2021 @ 23:35PM

అధ్వానంగా మారిన రోడ్లు

రహదారికి అడ్డుగా తిరిగిన ట్రాక్టర్‌ (ఫైల్‌)

  • అసంపూర్తిగా ఉన్న రహదారి బెర్మ్‌లు
  • ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

రాజవొమ్మంగి, సెప్టెంబరు 12: ఇటీవల కురిసిన వర్షాలకు ఏజెన్సీలో రహదారులు అధ్వానంగా మారాయి. మండలంలోని రాజవొమ్మంగి నుంచి చెరుకుంపాలెం వరకు ఉన్న రహదారిని గతంలో నేషనల్‌ హైవే 516గా పేరు మార్చారు. రాజవొమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి గుంతలు, బురదమయంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు బెర్ములు అసంపూర్తిగా ఉండడం వల్ల రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారంలో ఇసుక ట్రాక్టర్‌ రోడ్డు ఎడ్జి దిగడంతో అదుపుతప్పి అడ్డంగా తిరిగిపోయింది. డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. గొబ్బిళమడుగు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇటీవల మోటర్‌సైకిల్‌పై చెఱుకుంపాలెం వెళుతుండగా జడ్డంగి గ్రామ శివారులో ఎదురుగా భారీ వాహనం రావడంతో పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నించగా మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి పడిపోయారు. దీంతో గొనడ జగ్గారావు తలకు తీవ్రంగా గాయంమైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారి బెర్మ్‌లకు మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.