పనిలేకుండా రోడ్డెక్కితే కేసులే!

ABN , First Publish Date - 2020-04-09T09:59:37+05:30 IST

పనిలేకుండా రోడ్డెక్కితే కేసులే!

పనిలేకుండా రోడ్డెక్కితే కేసులే!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కరోనాను అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించే వారిపై కొరడా ఝుళిపించేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. పనిలేకున్నా షికార్ల కోసం రోడ్లపై చక్కర్లు కొడుతున్న వారిపై కఠి న చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అత్యవసర సేవల పేరుతో తప్పించుకు నే వారిని గుర్తించేందుకు పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేసి ఆరా తీస్తున్నారు. సరైన కారణం లేకుండా తిరుగుతున్న వారి వాహనాల్ని స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తున్నారు. అనుమా నం కలిగిన వారితో పాటు వాహనం ఫొటో తీస్తున్నారు. వాటిని టెక్నాలజీ ఆధారంగా క్రాస్‌ చెక్‌ చేసి, అబద్ధమని తేలితే కేసు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ను ప్రతి ఒక్కరు కచ్ఛితంగా పాటించాలని, అవసరమైతేనే బయటికి రావాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. నిత్యావసర సరుకులకు ఇంటి నుం చి 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే వారిని గుర్తించి కేసు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ అమలు, రోడ్లపై జన సంచారాన్ని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా డ్రౌన్‌ కెమెరాలను సైతం వినియోగిస్తున్నారు. 

Updated Date - 2020-04-09T09:59:37+05:30 IST