రోస్టెడ్‌ ఎగ్‌ప్లాంట్‌ బెల్‌ పెప్పర్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2020-10-17T18:25:11+05:30 IST

సలాడ్‌ ఆయిల్‌: 20 ఎం.ఎల్‌, ఉల్లిపాయ ఒకటి, పెద్ద వంకాయలు- రెండు, రెడ్‌ క్యాప్సికం- ఒకటి, గ్రీన్‌ క్యాప్సికం- ఒకటి, లవంగాలు, వెల్లుల్లి- రెండు, టొమాటోలు-రెండు, ఉప్పు

రోస్టెడ్‌ ఎగ్‌ప్లాంట్‌  బెల్‌ పెప్పర్‌ సలాడ్‌

కావలసినవి: సలాడ్‌ ఆయిల్‌: 20 ఎం.ఎల్‌, ఉల్లిపాయ ఒకటి, పెద్ద వంకాయలు- రెండు, రెడ్‌ క్యాప్సికం- ఒకటి, గ్రీన్‌ క్యాప్సికం- ఒకటి, లవంగాలు, వెల్లుల్లి- రెండు, టొమాటోలు-రెండు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి- పది గ్రా.


తయారీ విధానం: ముందుగా స్టవ్‌ మీద వెడల్పాటి పాన్‌లో నూనే వేసి మీడియం సైజ్‌ మంట మీద వేడిచేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేగించాలి. తరువాత వాటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. మిగతా ఆయిల్‌ను పాన్‌లో వేసి వంకాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు వేసి మెత్తగా ఉడికేంత వరకు వేగించాలి. టొమాటో, వెల్లుల్లి, ఉప్పు, మిరియాల పొడి వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి.


Updated Date - 2020-10-17T18:25:11+05:30 IST