లక్కీ ఫ్యామిలీ.. ఇంట్లో రూ.13 లక్షలు చోరీ జరిగితే తిరిగిచ్చింది ఏకంగా రూ.8 కోట్లు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-01-15T15:38:47+05:30 IST

ఒకవేళ రూ. 13 లక్షల సొత్తు చోరీ జరిగి..

లక్కీ ఫ్యామిలీ.. ఇంట్లో రూ.13 లక్షలు చోరీ జరిగితే తిరిగిచ్చింది ఏకంగా రూ.8 కోట్లు.. అసలు కథేంటంటే..

ఒకవేళ రూ. 13 లక్షల సొత్తు చోరీ జరిగి.. అది రూ. 8 కోట్లుగా తిరిగి వచ్చిందంటే దానిని దొంగతనమంటారా? లేక ఇన్వెస్ట్‌మెంట్ అని అంటారా? ముంబైలో ఇటువంటి ఉదంతమే వెలుగు చూసింది. 22 ఏళ్ల క్రితం చోరీ జరగగా కొన్నేళ్ల తరువాత పోలీసులు ఆ చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అయితే చట్టపరమైన సమస్యల కారణంగా ఈ సొత్తును వారికి ఇవ్వలేకపోయారు. ఇప్పుడు కోర్టు పిర్యాదుదారుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ చిరాగ్ దిన్ యజమాని అర్జన్ దస్వానీ ఇంటిలో 1998లో ఒక గోల్డ్ ఫాయిన్, రెండు గోల్డ్ బ్రాస్లెట్లు, 100 గ్రాములు, 200 మిల్లీగ్రాముల బరువుగల రెండు బంగారు కడ్డీలు చోరీకి గురయ్యాయి. అప్పట్లో వాటి ధర రూ. 13 లక్షలు. కోర్టు తీర్పు తరువాత ఈ బంగారం అర్జన్ కుమారుడు రాజూ దాస్వానీకి తిరిగి దక్కింది. 


కోలాబ్‌లోని అర్జన్ దాస్వానీ ఇంటిలో 1998 మే 8న ఈ చోరీ జరిగింది. దుండగుల గ్యాంగ్ .. అర్జన్ దాస్వానీ ఇంటి సెక్యూరిటీ గార్డును గాయపరిచి, లోనికి చొరబడి దాస్వానీ కుటుంబ సభ్యులందరినీ బంధించారు. వారి దగ్గరి నుంచి తాళాలు స్వాధీనం చేసుకుని బంగారం ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జైల్లో ఉన్న నేరస్తుల నుంచి పోలీసులు కొంత చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారందరూ దొరికేవరకూ ఈ సొత్తును పోలీసుల కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఎంతకాలమైనప్పటికీ పరారైన నిందితులు దొరకకపోవడంతో ఫిర్యాదుదారు రాజూ దాస్వానీ తన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. అదేవిధంగా ఈ నగదుకు సంబంధించిన అన్ని దస్తావేజులనూ కోర్టుకు సమర్పించారు. దీని ఆధారంగా ఆ చోరీ సొత్తు రాజూ దాస్వానీకి చెందినదేనని కోర్టు స్ఫష్టం చేసింది. దీంతో ఇంకా ఆ సొత్తును పోలీసుల కస్టడీలో ఉంచడంలో అర్థం లేదని భావించింది. ఫిర్యాదుదారు తన సొత్తును తిరిగి తీసుకునేందుకు ఇన్నేళ్లు వేడివుండటమంటే అది న్యాయ ప్రకియను కించపరచడం, దుర్వినియోగం చేయడం లాంటిదేనని కోర్టు భావించింది. వెంటనే ఆ సొత్తును ఫిర్యాదుదారుకు అప్పగించాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ సొత్తుకు విదేశాల్లో ఉంటున్న రాజు అక్కాచెల్లెళ్లు వారసులు. అయితే వారు ఈ బంగారం తన సోదరునికి తిరిగి ఇచ్చేందుకు అనుమతి పత్రం సమర్పించారు. దీంతో ఎట్టకేలకు రాజు ఆ బంగారాన్ని దక్కించుకోగలిగారు. 



Updated Date - 2022-01-15T15:38:47+05:30 IST