దోపిడీ దందా!

ABN , First Publish Date - 2022-09-13T06:17:03+05:30 IST

పత్తి కొనుగోళ్లలో కొంద రు సీసీఐ అధికారులు వ్యాపారులతో చేతులు కలిపి దోపిడీ దందాకు ఎగబడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్త పత్తి మార్కెట్లతో పోటీపడే జిల్లా పత్తి మార్కెట్‌లో ఏటా 25లక్షల నుంచి 30లక్షల క్విం టాళ్ల వరకు కొనుగోళ్లు జరుగుతాయి.

దోపిడీ దందా!
విక్రయించేందుకు మార్కెట్‌కు తరలించిన పత్తి పంట (ఫైల్‌)

జిల్లా పత్తి వ్యాపారులతో సీసీఐ అధికారుల కుమ్మక్కు 

రూ.400 కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు

సీబీఐ నోటీసులతో ఉలిక్కి పడుతున్న జిల్లా వ్యాపారులు  

విచారణతో లెక్క తేల్చేందుకు సిద్ధమైన సీబీఐ


ఆదిలాబాద్‌, సెప్టెంబరు12 (ఆంధ్రజ్యోతి): పత్తి కొనుగోళ్లలో కొంద రు సీసీఐ అధికారులు వ్యాపారులతో చేతులు కలిపి దోపిడీ దందాకు ఎగబడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశవ్యాప్త పత్తి మార్కెట్లతో పోటీపడే జిల్లా పత్తి మార్కెట్‌లో ఏటా 25లక్షల నుంచి 30లక్షల క్విం టాళ్ల వరకు కొనుగోళ్లు జరుగుతాయి. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర దక్కేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన సీసీఐ (కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ద్వారా పత్తి కొనుగోళ్లను చేపడుతారు. గత ఏడాది పత్తికి మద్దతును మించిన ధర పలుకడంతో సీసీఐ నామమాత్రంగానే కొనుగోలు చేసింది. అంతకుముందు అధికంగా సీసీఐ ద్వారానే కొనుగోళ్లు జరిగేవి. ముఖ్యంగా 2017-18, 2018-19 సంవత్సరాలలో వ్యాపారులు, సీసీఐ అధికారులు కు మ్మకై భారీ స్కాంకు తెరలేపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అవినీతిని గుర్తించిన సీసీఐ ఉన్నతాధికారులు సీబీఐ అధికారుల ద్వారా దర్యాప్తు జరిపించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే జిల్లాలో ముగ్గురు వ్యాపారులకు నోటీసులను అందించినట్లు తెలుస్తోంది. సీసీఐ, ప్రైవేట్‌ వ్యాపారులు మిలాఖత్‌ అయి కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేపట్టి అసలు లెక్కాను తేల్చేందుకు సీబీఐ అఽదికారు లు సిద్ధమైనట్లు తెలుస్తుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన పత్తి వ్యాపారుల్లో కనిపిస్తుంది. 

అంచనాలను పెంచి మరీ..

జిల్లాలో పని చేసిన కొందరు సీసీఐ అధికారు లు వ్యాపారులతో కుమ్మకై దూదిశాతం అంచనాలను పెం చి మరీ దోపిడీ దందాకు తెరలేపారని తెలుస్తుంది. పదేళ్ల క్రితం నుంచే జిల్లాలో మేలైనా బీటీ రకం పత్తి పంట సాగవుతుంది. దీంతో నాణ్యమై న దిగుబడులు వస్తున్నాయి. అయినా అధికారులు అంచనాలను తక్కువ చూపి అందినకాడి కి దండుకుంటున్నారు. అసలైన అంచనాల ప్రకా రం పది క్వింటాళ్ల పత్తికి 3క్వింటాళ్ల 56కిలోల నాణ్యమైన దూది వస్తుంది. దీనిని ఒకకాండి పత్తిగా పరిగణిస్తారు. సుమారు ఆరు ఘటాన్‌ల పత్తికి ఒక కాండి చొప్పున లెక్క కడుతారు. సీసీఐ అధికారులు జిల్లాలో 11 క్వింటాళ్ల పత్తికి ఒక కాండి చొప్పున దూది వస్తుందని లె క్క చూపుతున్నారు. పత్తి విత్తన కంపెనీలు చెప్పినదానికి క్షేత్రస్థాయిలో వస్తున్న దిగుబడులకు సీసీఐ అధికారుల అంచనాలకు పొంతన లేకుండానే పోయింది. దీనిపై గ తంలో సీబీఐ అధికారులు జిల్లాకు చెందిన కొందరు పత్తివ్యాపారుల నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మళ్లీ తాజాగా 2017-18, 2018-19 రెండేళ్లలో జరిగిన కొనుగోళ్లలో అవినీతి జరిగిందంటూ అంచ నా వేస్తున్నారు. సుమారు రూ.400కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు సీబీఐ అధికారులు తాజాగా గుర్తించారు.

ఒక్కో అధికారికి మూడు సెంటర్లు..

పత్తి కొనుగోళ్ల సమయంలో ఒక్కో సీసీఐ అధికారికి మూడు నుంచి నాలుగు సెంటర్ల ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తున్నారు. నిబంధనల ప్రకారం జిల్లాలో ఏర్పాటు చేసిన 10 సెంటర్లకు ఒక్కో అధికారిని నియమించాలి. కొందరు కిందిస్థాయి అధికారులు (సీపీఓ) పైరవీలు చేస్తూ ఇన్‌చార్జి సెంటర్లను దక్కించుకుంటున్నారు. పై అధికారులకు ముడుపులు ముట్టచెబుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాుు. ఇప్ప టికే ఆదిలాబాద్‌ ఏ, బీ సెంటర్లలో భారీ అవినీతి జరిగినట్లు గుర్తించిన సీసీ ఐ ఉన్నతాధికారులు సీబీఐ ద్వారా సంబంధిత వ్యాపారుల కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఖుర్షీద్‌నగర్‌ జాతీయ రహదారి సమీపంలో కొనసాగుతున్న జిన్నింగ్‌ వ్యాపారులకు నోటీసులు అందినట్లు తెలుస్తుంది. దీంతో వ్యాపార వర్గాల్లో ఉలిక్కిపాటు కనిపిస్తుంది. ప్రముఖ వ్యాపారులుగా చెప్పుకునే ముగ్గురు పత్తి వ్యాపారుల అవినీతి బాగోతం బయట పడకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. నోటీసుల విషయాన్ని గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే త్వరలోనే పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

Updated Date - 2022-09-13T06:17:03+05:30 IST