Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోబోలకు రూపాన్ని ఇస్తే!

మీ రూపాన్ని రోబోలకు అమ్మే ఆలోచన ఉందా? వాటికి మీ వాయిస్‌ను ఉపయోగించుకునే హక్కును ఇస్తారా? అయితే అక్షరాలా మీకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇస్తారు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే చదవండి.

 రష్యాకు చెందిన ‘ప్రోమోబోట్‌’ అనే రోబోటిక్స్‌ కంపెనీ ప్రస్తుతం హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, ఇతర రద్దీ ప్రదేశాల్లో ఉపయోగించేందుకు హ్యూమనాయిడ్‌ రోబో అసిస్టెంట్‌లను తయారుచేస్తోంది. ఈ రోబోలు  మనుషుల్లా ఉంటాయి. ఈ రోబోలకు ఆకర్షణీయమైన రూపాలు ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ భావిస్తోంది. అందుకే ఎవరైనా ముఖానికి సంబంధించిన హక్కులను శాశ్వతంగా రాసిస్తే వాళ్లకు కోటి యాభై లక్షలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ కంపెనీ గతంలో ఒకసారి హాలీవుడ్‌ నటుడు అర్నాల్డ్‌ స్కావెనెగ్గర్‌ ముఖాన్ని రోబోలకు ఉపయోగించింది. దాంతో కంపెనీ న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి అలాకాకుండా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాలని నిర్ణయానికి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారిలో నచ్చిన ముఖాన్ని 3డి మోడల్‌లో చిత్రీకరించుకుంటారు. అలాగే గెలిచిన వ్యక్తి 100 గంటల పాటు స్పీచ్‌ మెటీరియల్‌ను చదవాల్సి ఉంటుంది. అయితే కంపెనీ దరఖాస్తులను ఆహ్వానించిన రోజే 20 వేల అప్లికేషన్లు వచ్చాయట. దాంతో  కొత్త దరఖాస్తులు తీసుకోవడాన్ని నిలిపేస్తున్నట్లు కంపెనీ వెబ్‌సైట్‌లో పెట్టింది.

Advertisement
Advertisement