రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌

ABN , First Publish Date - 2021-08-31T05:30:00+05:30 IST

రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌ గురించి భయాలు, అపోహలు ఉంటున్నాయి. వాటిని వదిలించుకోవాలంటే రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌ గురించి అవగాహన పెంచుకోవాలి...

రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌

రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌ గురించి భయాలు, అపోహలు ఉంటున్నాయి. వాటిని వదిలించుకోవాలంటే రోబోటిక్‌ నీ రీప్లేస్‌మెంట్‌ గురించి అవగాహన పెంచుకోవాలి. 


మోకీలు మార్పిడి అంటే?

మోకీలులో అరిగిపోయిన గుజ్జును, ఎముకను కోత కోసి, దాని స్థానంలో కొత్త కీలును అమర్చడమే మోకీలు మార్పిడి. దీని వల్ల మోకాలు నొప్పి లేకుండా పూర్తి స్థాయిలో పనిచేసే వీలు కలుగుతుంది.


మోకీలు మార్పిడిలో రోబో అవసరం?

తొలగించిన ఎముక స్థానంలో కొత్త కీలును అమర్చే సమయంలో కచ్చితమైన కొలతలను అనుసరించాలి. కోణాలు సరిపోలకపోయినా, చిన్నపాటి (2 - 5 డిగ్రీలు) వంకరలు వచ్చినా, కృత్రిమ కీలు మన్నిక, పనితనం తగ్గిపోతాయి. సర్జరీలో ఎముకను కోసే బ్లేడ్‌ ఏమాత్రం పక్కకు తొలగినా, లిగమెంట్లు డ్యామేజీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సర్జరీలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా వైద్యులకు రోబో సహాయపడుతుంది. అలా వైద్యునికి తోడ్పడే ఆధునిక పరిజ్ఞానమే రోబోటిక్స్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ. 


సర్జరీలో రోబో పాత్ర?

సర్జరీలో మోకాలును ఓపెన్‌ చేసిన తర్వాత, రోబోటిక్‌ హ్యాండ్‌, ప్రోబ్‌ సహాయంతో మోకీలు పూర్తి 3డి ఇమేజ్‌ను రోబోట్‌ తయారు చేసుకుంటుంది. మోకీలు ఎక్కడ, ఎంత అరిగింది? ఎక్కడ, ఎంత లోతు ఎముకను తొలగించాలి? ఏ కోణంలో ఎముక, లిగమెంట్లు డ్యామేజ్‌ అయ్యాయి? ఎముక దెబ్బతినకుండా మోకీలు వంకరను ఎన్ని డిగ్రీలకు సరి చేయాలి? ఇలాంటి అంశాలన్నీ విశ్లేషించి,  ఒక ప్రణాళికను స్ర్కీన్‌ మీద చూపిస్తుంది. దాన్ని బట్టి వైద్యుడు తన అనుభవజ్ఞానంతో రోబోటిక్‌ హ్యాండ్‌ సహకారంతో ఎముకను, లిగమెంట్లను బ్యాలెన్స్‌ చేసుకుంటూ నీ బ్యాలెన్సింగ్‌ చేస్తారు. తర్వాత అవసరమైన సైజు ఇంప్లాంట్‌ను ఎంచుకుని బోన్‌ సిమెంట్‌ సహాయంతో కీలులో అమర్చి, రోబోటిక్‌ కెమెరా ద్వారా మోకీలు కదలికలు, స్థిరత్వాలను కచ్చితంగా సరి చూసుకుంటారు. 


రోగి పొందే ప్రయోజనాలు?

తక్కువ సమయంలో తక్కువ ఎముకను తొలగించడం వల్ల కచ్చితమైన లిగమెంట్‌ బ్యాలెన్సింగ్‌ పొందవచ్చు. ఫలితంగా సర్జరీ తదనంతర నొప్పి తగ్గుతుంది. త్వరగా కోలుకుని, త్వరగా ఫిజియోథెరపీ మొదలుపెట్టవచ్చు సర్జరీలో రక్తస్రావం తక్కువగా ఉండడం వల్ల రోగి మరుసటి రోజే లేచి అడుగులు వేయగలుగుతాడు. రోబోటిక్‌ సర్జరీ వల్ల కీళ్ల మన్నిక ఎక్కువ.


ఏ వయసు వాళ్లు?

మోకీలు మార్పిడి నిర్ణయం రోగి బాధ తీవ్రతను బట్టి ఉంటుంది. నొప్పితో రోగి ఏ పనులు చేయలేకపోతున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పని భారం ఎక్కువగా ఉండే చిన్న వయసులో నొప్పులు భరించి, వయసు పెరిగిన తర్వాత మోకీలు మార్పిడి  చేయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. సర్జరీ మరుసటి రోజే ఎవరిమీదా ఆధారపడకుండా నడవవచ్చు. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కువ కాలం మన్నికనిచ్చే ఇంప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి. (ఆక్సీనియం - 30 ఏళ్లు)




శ్రీకర హాస్పిటల్‌ - విజయవాడలో రోబోటిక్స్‌?

సెంట్రల్‌ ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా విజయవాడలో రోబోటిక్స్‌ను శ్రీకర హాస్పిటల్‌ పరిచయం చేసింది. అత్యాధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానాన్ని, మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం డా. గురునాధశర్మ, శ్రీకర హాస్పిటల్‌, విజయవాడలో అందుబాటులో ఉంటారు. అన్ని వైద్య సదుపాయాలు, తాజా సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన వైద్యసేవలు అందించగల సామర్ధ్యం శ్రీకర హాస్పిటల్‌ (విజయవాడ)కు ఉంది.



-శ్రీకర హాస్పిటల్స్‌

ఎస్‌.హెచ్‌-65, ఈనాడు ఆఫీసు ఎదురుగా, రామచంద్రనగర్‌,

బెంజి సర్కిల్‌ దగ్గర, విజయవాడ-10. ఫోన్‌:0866 3312345

డా. బి.వి. గురునాధ శర్మ,

M.B.B.S, D.N.B, F.I.P.O.

రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌, పిల్లల ఎముకల సర్జన్‌,
Consultant Trauma & Orthopaedic Surgeon

ఫోన్‌: 86183 32360, 772999 0003


Updated Date - 2021-08-31T05:30:00+05:30 IST