Aug 1 2021 @ 00:23AM

రాక్వెల్‌ డీ కోస్టా... గందక్‌ రాక్కమ్మ!

రాక్వెల్‌ డీ కోస్టా అలియాస్‌ గందక్‌ రాక్కమ్మగా జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నడ కథానాయకుడు కిచ్చా సుదీప్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. ఇందులో కీలక పాత్రలో నటించడంతో పాటు ఓ పాటలో జాక్వలిన్‌ స్టెప్పులు వేశారు. కొన్ని రోజుల క్రితం చిత్రీకరణ పూర్తి చేశారు. గందక్‌ రాక్కమ్మగా జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ముంబై బిల్‌బోర్డ్స్‌ సహా సహా దేశంలోని ఇతర నగరాల్లో ఆమె లుక్‌ను ప్రదర్శించనున్నారు. ‘‘గందగ్‌ రాక్కమ్మ పాత్రలో వేరియేషన్స్‌ ఉంటాయి. సుదీప్‌ పోషించి విక్రాంత్‌ రోణకు జోడీగా జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ పాత్ర ఉంటుంది. హోటల్‌ నిర్వహించే మహిళగా కనిపిస్తారు’’ అని దర్శకుడు అనూప్‌ భండారి చెప్పారు. ‘‘14 భాషలు, 55 దేశాల్లో మా యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రాన్ని త్రీడీలో విడుదల చేస్తాం’’ అని నిర్మాత జాక్‌ మంజునాథ్‌ తెలిపారు. షాలినీ మంజునాథ్‌తో కలిసి ఆయన చిత్రాన్ని నిర్మించారు.