నెక్లెస్‌ రోడ్డులో నడక కష్టమే

ABN , First Publish Date - 2021-04-14T06:43:26+05:30 IST

చిన్న వర్షానికే నెక్లెస్‌ రోడ్డుపై నడవడం కష్టంగా మారింది.

నెక్లెస్‌ రోడ్డులో నడక కష్టమే

 చిన్న వర్షానికే ఫుట్‌పాత్‌లు మునక

 ఇటీవలే రూ. 26 కోట్లతో వీడీసీసీ రోడ్డు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చిన్న వర్షానికే నెక్లెస్‌ రోడ్డుపై నడవడం కష్టంగా మారింది. సోమవారం సాయంత్రం నెక్లెస్‌ రోడ్డులో చిరు జల్లులు కురిశాయి.  మంగళవారం మధ్యాహ్నం వరకు రోడ్డుపై వర్షపు నీరు నిలిచే ఉంది. ఫుట్‌పాత్‌లపై కూడా నిండు గా వర్షపు నీరు అలాగే ఉంది. సంజీవయ్య పార్కు పరిసర ప్రాంతాల్లో, నెక్లెస్‌ రోడ్డులో కనీసం నడిచేందుకు కూడా వీలు లేకుండా నీరు నిలిచి ఉంది. గతేడాది లాక్‌డౌన్‌లో నెక్లెస్‌ రోడ్డులో ఉన్న బ్లాక్‌ టాప్‌ (బీటీ) రోడ్డును పూర్తిగా తొలగించి, ఆరు కిలోమీటర్ల మేర రూ. 26 కోట్ల తో వాక్యూమ్‌ డీవాటర్డ్‌ సిమెంట్‌ కాంక్రిట్‌ (వీడీసీసీ) రోడ్డు వేశారు. పీవీ జ్ఞాన భూమి ఎదుట, మరో చోట వర్షపు నీరు వెళ్లే విధంగా డ్రైయిన్‌ నిర్మించారు. నెక్లెస్‌ రోడ్డులో నీటి డ్రెయిన్‌ లేదు. పీపూల్స్‌ ప్లాజా కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి డ్రెయిన్‌ మ్యాన్‌హోల్స్‌ 20 మీటర్లకు ఒకటి ఏర్పాటు చేసినా, మ్యాన్‌హోల్స్‌ ఎత్తుగా ఉండడంతో నీరంతా రోడ్డుపై నిలిచి ఉంటోంది.  బుద్దభవన్‌ నుంచి జలవిహర్‌ వరకు ఇరువైపులా వర్షపు నీరు ఫుట్‌పాత్‌లపై వర్షపు నీరు నిలిచి ఉంది. నగర పర్యాటకానికి పేరు గాంచిన నెక్లెస్‌ రోడ్డులో పరిస్థితి ఇలా ఉండటంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.  వెంటనే సమస్య పరిష్కరించాలని, డ్రైయిన్లు నిర్మించాలని కోరుతున్నారు. 

Updated Date - 2021-04-14T06:43:26+05:30 IST