ధోనీ..ఇక తప్పుకో!

ABN , First Publish Date - 2020-08-02T09:09:10+05:30 IST

యువకులకు అవకాశం ఇచ్చేందుకు ధోనీ తక్షణమే క్రికెట్‌ నుంచి వైదొలగాలని మాజీ సెలెక్టర్‌ రోజర్‌ బిన్నీ సూచించాడు...

ధోనీ..ఇక తప్పుకో!

మాజీ సెలెక్టర్‌ బిన్నీ సూచన

న్యూఢిల్లీ: యువకులకు అవకాశం ఇచ్చేందుకు ధోనీ తక్షణమే క్రికెట్‌ నుంచి వైదొలగాలని మాజీ సెలెక్టర్‌ రోజర్‌ బిన్నీ సూచించాడు. బ్యాట్స్‌మన్‌గా మునుపటి సామర్థ్యాలను ప్రదర్శించలేకపోతున్న ధోనీ.. గత రెండేళ్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈనేపథ్యంలో బిన్నీ మాట్లాడుతూ.. ‘కొన్ని సీజన్లుగా మహీ ఆటను గమనిస్తే.. అతడు ఉత్తమ ఆటగాడు అనే విషయం గతమేనని అవగతమవుతుంది. ఫిట్‌నెస్‌ కూడా ఒకింత కోల్పోయాడు. దేశ క్రికెట్‌లోకి యువ ఆటగాళ్లు దూసుకొస్తున్నారు. ఇది గమనించి ధోనీ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని అన్నాడు. 

Updated Date - 2020-08-02T09:09:10+05:30 IST