Abn logo
Nov 18 2021 @ 20:13PM

‘అవును నేనే కెప్టెన్’ అంటూ 9 ఏళ్ల క్రితం రోహిత్ చేసిన ట్వీట్ వైరల్

జైపూర్: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ 9 సంవత్సరాల  క్రితం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ విజయాలు అందించిపెట్టాడు. అయితే, అవన్నీ పార్ట్‌టైం కెప్టెన్‌గా మాత్రమే. తాజాగా ఫుల్‌టైం కెప్టెన్‌గా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి తొలి విజయాన్ని అందుకున్నాడు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నిన్న జైపూర్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ జరిగింది. 


టీ20 కెప్టెన్‌గా రోహిత్‌కు అరంగేట్ర మ్యాచ్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం జైపూర్‌లోనే ముంబై జట్టుకు తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. 7 నంబరు 2012న రోహిత్ ట్వీట్ చేస్తూ.. ‘‘జైపూర్‌లో అడుగుపెట్టాం. అవును, జట్టుకు నేనే కెప్టెన్. ఇది నా బాధ్యతను మరింత పెంచింది’’ అని ట్వీట్ చేశాడు.


ఇప్పుడీ ట్వీట్‌ను రోహిత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.  రంజీ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మ తొలిసారి ముంబైకి సారథ్యం వహించిన ఆ మ్యాచ్ జైపూర్‌లోని కేఎల్ సైనీ గ్రౌండ్‌లో జరిగింది. తాజాగా టీ20 ఫుల్‌టైం కెప్టెన్సీగా అరంగేట్ర మ్యాచ్ కూడా అదే గ్రౌండ్‌లో జరగడంతో పాత ట్వీట్‌ను వెలుగులోకి తీసుకొచ్చిన ఓ అభిమాని దానిని వైరల్ చేశాడు.