రోహిత్‌నే తప్పించమంటారా?

ABN , First Publish Date - 2021-10-26T08:13:36+05:30 IST

పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఓ విచిత్రమైన ప్రశ్న....

రోహిత్‌నే తప్పించమంటారా?

 విలేకరి ప్రశ్నకు కోహ్లీ దీటైన సమాధానం

దుబాయ్‌: పాకిస్థాన్‌తో ఓటమి తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు దీటుగా బదులిచ్చి ఆ విలేకరి నోరు మూయించాడు. తొలి బంతికే డకౌట్‌ అయిన రోహిత్‌ను తప్పించి ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను తీసుకుంటారా? అని రిపోర్టర్‌ అడగడంతో కోహ్లీ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ‘ఇది చాలా డేరింగ్‌ ప్రశ్న. మీరేమనుకుంటున్నారు? నేనేది ఉత్తమమనుకున్నానో ఆ జట్టుతో ఆడాను. కానీ మీ అభిప్రాయం ఏమిటి? అంతర్జాతీయ టీ20ల నుంచి నీవు రోహిత్‌ను తప్పిస్తావా? మా చివరి మ్యాచ్‌లో అతడెలా ఆడాడో నీకు తెలుసా? నిజంగా నమ్మలేకపోతున్నాను. మీకేదైనా వివాదం కావాల్సి వస్తే ముందే చెప్పండి. దానికి తగినట్టుగా స్పందిస్తా’ అని నవ్వుతూనే ఆ విలేకరికి చురకంటించాడు.

Updated Date - 2021-10-26T08:13:36+05:30 IST