Abn logo
Sep 26 2021 @ 14:21PM

సస్పెండ్ చేయండి సార్.. మంత్రి పెద్దిరెడ్డికి MLA Roja ఫిర్యాదు

చిత్తూరు జిల్లా: నిండ్ర ఎంపీపీ ఎన్నిక వివాదం రోజు రోజుకు రాజుకుంటోంది. ఆదివారం మంత్రి పెద్ది రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే రోజా.. చక్రపాణి  రెడ్డి వర్గంపై ఫిర్యాదు చేశారు. చక్రపాణి రెడ్డితో సహా ఆయన వర్గానికి చెందిన ఎంపీటీసీలను, ఇతర నాయకులను సస్పెండ్ చేయాలని కోరారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీలో గ్రూపు రాజకీయాలు చేయడమంటే అధినేత జగన్ మాటను ధిక్కరించడమేనని ఎమ్మెల్యే రోజా అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలతో చేతులు కలిపి పార్టీ పరువుతీయడానికి రోడ్డుపై ధర్నాలు చేయడమేంటని ప్రశ్నించారు. విప్‌ను ధిక్కరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఎమ్మెల్యేలను, పార్టీ నాయకులను, అధికారులను బూతులు తిడుతున్నవారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రోజా కోరారు.


మరోవైపు మంత్రి పెద్దిరెడ్డిని చక్రపాణి రెడ్డితోపాటు ఆయన వర్గీయులు ఎంపీపీలు కలవబోతున్నారు. నిండ్ర ఎంపీపీ ఎన్నికల ఎపిసోడ్‌పై తమ వెర్షన్ వివరించనున్నారు. మొత్తానికి ఎంపీపీ ఎన్నికలు వైసీపీలో వర్గపోరుకు దారితీసింది.

ఇవి కూడా చదవండిImage Caption