గ్రాండ్ సలామ్

ABN , First Publish Date - 2020-10-12T08:55:37+05:30 IST

రోజర్‌ రికార్డును సమం చేయడమేకాదు, ఇది రొలాండ్‌ గారోస్‌ విజయం కూడా.

గ్రాండ్ సలామ్

నడాల్‌ టైటిళ్లు

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ -    1

ఫ్రెంచ్‌ ఓపెన్‌ - 13

వింబుల్డన్‌ -    2

యూఎస్‌ ఓపెన్‌ -    4


 అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల హీరోలు

రోజర్‌ ఫెడరర్‌ - 20

రఫెల్‌ నడాల్‌ - 20

నొవాక్‌ జొకోవిచ్‌ - 17

పీట్‌ సంప్రాస్‌ -         14

రాయ్‌ ఎమర్సన్‌ - 12


 ప్రైజ్‌మనీ

నడాల్‌ రూ. 13. 81 కోట్లు

జొకోవిచ్‌ రూ. 6.90 కోట్లు


నడాల్‌ ఖాతాలో 13వ ఫ్రెంచ్‌ ఓపెన్‌

ఫెడరర్‌ గ్రాండ్‌స్లామ్స్‌ టైటిళ్ల రికార్డు సమం

ఫైనల్లో జొకోవిచ్‌ చిత్తు


రోజర్‌ రికార్డును సమం చేయడమేకాదు, ఇది రొలాండ్‌ గారోస్‌ విజయం కూడా. నా కెరీర్‌లో ఎన్నో మధురమైన క్షణాలు ఈ టోర్నీతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ ఆడడం నాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది.


ఎర్రమట్టి మరోసారి స్పెయిన్‌ బుల్‌కు సలాం కొట్టింది.. రొలాండ్‌ గారో్‌స మకుటం లేని మహరాజుకే పట్టం కట్టింది.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ కిరీటం మళ్లీ నడాల్‌నే వరించింది.. చిరకాల ప్రత్యర్థి నొవాక్‌ జొకోవిచ్‌తో జరిగిన ఫైనల్‌ను పూర్తి ఏకపక్షం చేసిన రఫెల్‌ నడాల్‌.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇక్కడ పదమూడోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు.. ఈ విజయంతో కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ను ముద్దాడి స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ రికార్డునూ సమం చేశాడు.


పారిస్‌: ఒకటికాదు రెండు కాదు ఏకంగా 13వసారి రొలాండ్‌ గారో్‌సలో విజేతగా నిలిచిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ క్లే కోర్టులపై తనకు తిరుగు లేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో 6-0, 6-2, 7-5 స్కోరుతో సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ను నడాల్‌ చిత్తు చేశాడు. పోరాట యోధుడైన జొకో అంతిమ సమరంలో  తేలిపోయాడు.  టైటిల్‌ ఫైట్‌లో మూడో సెట్‌లో మినహా పూర్తిగా చేతులెత్తేశాడు.


నడాల్‌..అదుర్స్‌: తొలి గేమ్‌లోనే జొకో సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నడాల్‌ 3-0 ఆధిక్యంలోకి దూసుకు పోయాడు. మరోవైపు సర్వీసుల్లో, బ్యాంక్‌హ్యాండ్‌ విన్నర్లను సంధించడంలో జొకో తడబాటుకు లోనయ్యాడు. దాంతో పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న రఫా మొత్తం మూడుసార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 45 నిమిషాల్లోనే తొలి సెట్‌ను చేజిక్కించుకున్నాడు.  రెండో సెట్‌ తొలి గేమ్‌లో బ్యాక్‌హ్యాండ్‌ విన్నర్‌ను నడాల్‌ నెట్‌కు కొట్టడంతో జొకో పాయింట్ల ఖాతా తెరిచాడు. ఆపై సర్వీ్‌సను నిలబెట్టుకున్న నొవాక్‌ 2-5తో పోటీలోకొచ్చేలా కనిపించాడు. కానీ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని నడాల్‌ 6-2తో ఆ సెట్‌ను ముగించాడు.


ఏకపక్షంగా: మూడో సెట్‌లో మరింత జోరు ప్రదర్శించిన రఫా..ఐదో గేమ్‌లో నొవాక్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-2తో ముందంజ వేశాడు. వెంటనే నడాల్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసిన జొకో 3-3తో సమం చేశాడు. అదే ఊపులో  5-4తో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించాడు. దాంతో పోరాటానికి మారుపేరైన జొకో పుంజుకుంటాడని భావించినా 11వ గేమ్‌లో అతడి సర్వీస్‌ బ్రేక్‌ చేసిన నడాల్‌..ఆపై సర్వీ్‌సను నిలబెట్టుకొని ఓ అద్భుతమైన ఏస్‌తో చాంపియన్‌షి్‌ప పాయింట్‌ను సాధించాడు. అనంతరం మోకాళ్లపై నిలుచొని విజయ చిహ్నంగా చేతులను గాలిలోకి ఊపాడు. దాదాపు రెండున్నర గంటలు సాగిన మ్యాచ్‌లో 34 ఏళ్ల నడాల్‌ నాలుగు ఏస్‌లు సంధించి 31 విన్నర్లు కొట్టాడు. ఒకే ఒక ఏస్‌ వేసిన  33 ఏళ్ల జొకో 38 విన్నర్లు సంధించాడు. 


4ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా విజేతగా నిలవడం నడాల్‌కిది నాలుగోసారి


 13నడాల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు. రొలాండ్‌ గారోస్‌లో అత్యధిక టైటిళ్ల రికార్డు నడాల్‌దే.


100గత పదిహేనేళ్లలో నడాల్‌ రొలాండ్‌ గారోస్‌లో 102 మ్యాచ్‌లాడితే 100 మ్యాచ్‌లు గెలిచాడు. రెండుసార్లే ఓడిపోయాడు. 


’‘డబుల్స్‌’ విజేత బబోస్‌ జోడీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను టిమియా బబో్‌స-క్రిస్టినా మ్లదనోవిక్‌ జోడీ నిలబెట్టుకుంది. ఫైనల్లో  రెండో సీడ్‌ బబోస్‌ (హంగరీ)-మ్లదనోవిక్‌ (ఫ్రాన్స్‌) ద్వయం 6-4, 7-5తో అలెక్సా గ్వరాచి (చిలీ)-క్రాజిక్‌ (అమెరికా) జంటపై గెలిచింది.

Updated Date - 2020-10-12T08:55:37+05:30 IST