నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించుకున్న దేశాధినేత

ABN , First Publish Date - 2020-05-31T19:02:57+05:30 IST

భౌతిక దూరం నిబంధన పాటించకపోవడం, ప్రభుత్వ కార్యాలయంలో పొగ తాకడం వంటి చర్యలకు పాల్పడిన రోమేనియా దేశ ప్రధాని లుడివిక్ ఓర్బాన్ దాదాపు 600 డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.

నిబంధనలు ఉల్లంఘించి జరిమానా చెల్లించుకున్న దేశాధినేత

రోమేనియా: భౌతిక దూరం నిబంధన పాటించకపోవడం, ప్రభుత్వ కార్యాలయంలో పొగ తాకడం వంటి చర్యలకు పాల్పడిన రోమేనియా దేశ ప్రధాని లుడివిక్ ఓర్బాన్ దాదాపు 600 డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా ఆయన ఇటీవల ప్రభుత్వ కార్యాలయంలో ఓ సమావేశం నిర్వహించారు. దీని మంత్రులు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. అయితే ఆ సమవేశానికి సంబంధించిన ఫోటోలు బయటకు పొక్కడంతో అక్కడ కలకలం రేగింది. సమావేశంలో పాల్గొన్న పెద్దలెవరూ కూడా మాస్కులు ధరించలేదని ఫోటోల్లో బయటపడింది. అంతేకాకుండా.. ప్రభుత్వ కార్యలయంలో వారు పొగతాగుతూ మద్యం సేవించారని కూడా తెలిసింది. దీంతో అధికారులు ప్రధానిపై జరిమానా విధించడంతో ఆయన దాదాపు 600 డాలర్లు చేతి చమురు వదుల్చుకోవాల్సి వచ్చింది. 

Updated Date - 2020-05-31T19:02:57+05:30 IST