భలే భలే.. ఈ బూట్లు ధరిస్తే కరోనా ఖతం!

ABN , First Publish Date - 2020-12-04T21:23:51+05:30 IST

కరోనా వ్యాప్తికి బూట్లతో చెక్

భలే భలే.. ఈ బూట్లు ధరిస్తే కరోనా ఖతం!

బుకారెస్ట్: సామాజిక నిబంధనలు పక్కాగా పాటిస్తే కరోనా దరి చేరలేదు.. ఇది శాస్త్రవేత్తలు పక్కాగా చెబుతున్నమాట. అయితే..బద్ధకం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు లేదా పనిలోపడి మర్చిపోవడం కావచ్చు..కారణమేదైనా కానీ ప్రస్తుతం మనలో అనేక మంది ఈ నిబంధనలను పాటించక కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. అయితే..రోమేనియాలో బూట్లు తయారు చేసే గ్రెగోర్ లూప్ ఈ సమస్యకు తన దైనశైలిలో ఓ చక్కని పరిష్కారం కనిపెట్టారు. అదే..బాగా బారుగా ఉన్న బూట్లు. 


అవును.. ఆయన తయారు చేసిన బూట్ల ముందు భాగం చాలా పొడుగ్గా ఉంటుంది. వీటి సైజ్ 75. ఈ బూట్లను ధరించిన ఎవరైనా క్యూలో నిలబడినప్పుడు ఎదుటి వ్యక్తి చాలా దూరంలో ఉండాల్సి ఉంటుంది. లేకపోతే..ఎదుటి వ్యక్తికి బూట్లు తగిలే అవకాశం ఉంది. ఈ బూట్ల జతను ప్రతి ఒక్కరూ ధరిస్తే.. బహిరంగ ప్రదేశాల్లో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరమైన కనీసం రెండు మీటర్లు ఉంటుందని వారు ఆయన చెబుతున్నారు. దీంతో ఈ బూట్లు వేసుకున్నవారు క్రమంగా సామాజిక దూరం పాటించేందుకు అలవాటు పడిపోతారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. వీటి విషయం తెలియగానే అనేక మంది ఇవి మాకూ కావాలంటూ గ్రెగరీకి ఆర్డర్లు పెడుతున్నారట. భలేగా ఉంది కదూ.. కరోనాకు బూటు దెబ్బ!

Updated Date - 2020-12-04T21:23:51+05:30 IST