రూహ్‌ అఫ్జా మోజిటో

రూహ్‌ అఫ్జాతో చేసుకునే డ్రింక్‌ ఇది. ఈ పానీయాన్ని ఎలా తయారుచేసుకోవాలంటే...

కావలసినవి: రూహ్‌ అఫ్జా - రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, సోడా - అరగ్లాసు, తులసి ఆకులు - నాలుగైదు, ఐస్‌క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: ఒక గ్లాసులో మిరియాలపొడి, నిమ్మరసం, రూహ్‌ అఫ్జా తీసుకోవాలి. తరువాత అందులో చల్లటి నీళ్లు పోసి బాగా కలపాలి. ఇప్పుడు సోడా, ఐస్‌క్యూబ్స్‌ వేయాలి. తులసి ఆకులతో గార్నిష్‌ చేసి చల్లటి రూహ్‌ అఫ్జాను అందించాలి.


కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదావాటర్‌మెలన్‌ ఐస్‌క్రీంమ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీంబనానా ఐస్‌క్రీంస్ట్రాబెర్రీస్‌ ఐస్‌క్రీంఅప్రికాట్‌ ఐస్‌క్రీంకీరదోస - తులసి పానీయంమ్యాంగో లస్సీ
Advertisement
Advertisement