గది ఆకర్షణీయంగా ఉండాలంటే..!

ABN , First Publish Date - 2021-06-07T05:30:00+05:30 IST

లివింగ్‌రూమ్‌ని ఎలా డిజైన్‌ చేసుకోవాలి? ఆకర్షణీయంగా కనిపించాలంటే ఫాల్స్‌ సీలింగ్‌ ఎలా ఉండాలి? ఫ్లోరింగ్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం...

గది ఆకర్షణీయంగా ఉండాలంటే..!

లివింగ్‌రూమ్‌ని ఎలా డిజైన్‌ చేసుకోవాలి? ఆకర్షణీయంగా కనిపించాలంటే ఫాల్స్‌ సీలింగ్‌ ఎలా ఉండాలి? ఫ్లోరింగ్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం...


  1. లివింగ్‌రూమ్‌.... ఇంట్లో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం ఇది. ఈ ప్రదేశం ఆకర్షణీయంగా ఉండాలని చాలా మంది పింక్‌ కలర్‌ ఎంచుకుంటారు. కొంతమంది లైట్‌ బ్లూ రంగు వేసుకుంటారు. కానీ బీచ్‌ కలర్స్‌ లివింగ్‌రూమ్స్‌కి బాగా నప్పుతాయి. సూర్యరశ్మి పడే ప్రాంతంలో లైట్‌ కలర్‌ వేసుకోవాలి. దీనివల్ల ఇల్లు ఎక్కువ ఫోకస్‌ అవుతుంది. 
  2. ఫ్లోరింగ్‌ కోసం మార్బుల్‌ కన్నా సిరామిక్‌ ఎంచుకోవడం ఉత్తమం. ‘‘మార్బుల్‌ వేసుకుంటే మెయింటెనెన్స్‌ అవసరం ఉండదు. ఒకసారి పాలిష్‌ చేస్తే పదేళ్ల వరకు బాగుంటుంది’’ అనుకుంటారు. అయితే అంతకన్నా ఎక్కువ సర్వీ్‌సను సిరామిక్‌ టైల్స్‌ ఇస్తాయి. వీటిలో కూడా ఇప్పుడు డబల్‌ చార్జ్‌ టైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిని విట్రిఫైడ్‌ టైల్స్‌ అంటారు. ఇందులో కూడా యాంటీ గ్లేర్‌, యాంటీ రాక్టెనల్‌, యాంటీ ఫ్లాడెల్‌ రకాలు ఉన్నాయి. విట్రిఫైడ్‌ టైల్స్‌లో చదరపు అడుగు ధర రూ. 40 నుంచి 460 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇటాలియన్‌ మార్బుల్‌ కన్నా బాగుంటాయి. 
  3. చాలా ఫ్లాట్స్‌లో ప్రధాన ద్వారంలో నుంచి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎదురుగా గోడ ప్లెయిన్‌గా కనిపిస్తుంది. కానీ ఆ ప్రదేశంలో వాల్‌పేపర్స్‌ను అతికించినట్లయితే గది లుక్‌ మొత్తం మారుతుంది. ఇండోర్‌ మొక్కలు పెంచుకోలేని వారు, స్థలం లేని వారు ఫారెస్ట్‌ లుక్‌ కోసం వాల్‌పేపర్‌ను ఎంచుకోవచ్చు. వాల్‌ హ్యాంగర్స్‌ను కూడా పెట్టుకోవచ్చు. మార్కెట్‌లో ఆర్టిఫిషియల్‌ లాన్‌ దొరుకుతుంది. దాన్ని అతికించుకోవచ్చు. 
  4. కిటికీల కర్టెన్స్‌ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. టెంపరేచర్‌ కంట్రోల్‌లో ఉండాలి... కలప పాడవ్వకూడదు అంటే ఆయిల్‌ పెయింట్స్‌ను ఎంచుకోవాలి. అది కూడా వైట్‌ కలర్‌ ఎంచుకుంటే బాగుంటుంది. గ్రిల్స్‌ విషయానికొస్తే బార్స్‌గా తీసుకోవాలి. చాలామంది చెక్స్‌గా తీసుకుంటారు. కానీ అది హౌజ్‌ కాన్సెప్ట్‌ కాదు. 
  5. పడకగదిలో ఆరెంజ్‌ కలర్‌ ఎక్కువ చూస్తుంటాం. దీంతో పాటు లారినా పింక్‌ కూడా బెడ్‌రూమ్‌కు నప్పుతుంది. అలాగే వార్డ్‌రోబ్స్‌ కూడా బీచ్‌ కలర్స్‌లో ఉండేలా చూసుకోవాలి. డార్క్‌ మెరూన్‌ కలర్‌ ఇష్టపడతారు కానీ డార్క్‌ కలర్స్‌ వల్ల ఫంగస్‌, టర్మైట్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే బీచ్‌ కలర్స్‌ ఎంచుకోవాలి. 
  6. ఫాల్స్‌ సీలింగ్‌ను రకరకాల డిజైన్‌లో ఎంచుకుంటారు. నిజానికి ప్లెయిన్‌గా ఉంటేనే లుక్‌ బాగుంటుంది. రోప్‌ లైట్‌ కోసం ఒక ఇన్నర్‌ బాక్స్‌ తీసుకుంటే సరిపోతుంది. మధ్యలో షాండ్లియర్‌ పెట్టుకోవాలి. హాల్‌ 170 చదరపు అడుగులలోపే ఉంటుంది కాబట్టి ఎక్కువ డిజైన్‌కు వెళ్లకూడదు. ఎల్‌ఈడీ లైట్స్‌ వాడితే విద్యుత్‌ వినియోగం కూడా తక్కువగా ఉంటుంది. 
  7. టీవీ పెట్టుకునే వాల్‌ యూనిట్‌ను కార్పెంటర్‌తో తయారు చేయించుకోవడం ఉత్తమం. మార్కెట్లో రెడీమేడ్‌వి లభిస్తాయి. కానీ వాటికన్నా తక్కువ ధరలో నాణ్యమైన మెటీరియల్‌తో, నచ్చిన డిజైన్‌లో తయారు చేయించుకోవచ్చు. 
  8. పిల్లల పడకగదికి బేరీ పింక్‌ కలర్‌ను ఎంచుకోవాలి. ఈ రంగుకు పిల్లలు ఎక్కువ ఆకర్షితులవుతారు. పిల్లలు ఇష్టపడతారు కూడా! 
  9. చాలామంది విద్యుత్‌ ఆదా కోసం బాత్‌రూమ్‌లో జీరోబల్బు ఉపయోగిస్తుంటారు. కానీ అది సరికాదు. సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి.  
  10. హాల్‌, డైనింగ్‌ మధ్య వుడెన్‌ వాల్‌ను ఉపయోగించుకోవడం ద్వారా పార్టిషన్‌ చేసుకోవచ్చు.



- కె.పి. రావు

ప్రముఖ ల్యాండ్‌స్కేప్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌

ఫోన్‌: 8019411199


Updated Date - 2021-06-07T05:30:00+05:30 IST