రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోం క్వారంటైన్ సేవలు ప్రారంభం
ABN , First Publish Date - 2021-04-22T06:55:14+05:30 IST
రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోం క్వారంటైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. హోం క్వారంటైన్ గురించి తెలియ జేయటానికి, బాధితులకు ధైర్యం చెప్పి ఇంటి వద్దనే నర్సింగ్ సేవలు, ఆక్సిజన్, డాక్టర్స్ సేవలు అతి తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్ధేశ్యంతో ‘రూట్స్ హెల్త్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ పీవీఎస్ విజయభాస్కర్ బుధవారం హోం క్వారంటైన్ సర్వీస్‌ను ప్రారంభించారు.
పాయకాపురం, ఏప్రిల్ 21 : రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోం క్వారంటైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. హోం క్వారంటైన్ గురించి తెలియ జేయటానికి, బాధితులకు ధైర్యం చెప్పి ఇంటి వద్దనే నర్సింగ్ సేవలు, ఆక్సిజన్, డాక్టర్స్ సేవలు అతి తక్కువ ఖర్చుతో అందించాలనే ఉద్ధేశ్యంతో ‘రూట్స్ హెల్త్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ పీవీఎస్ విజయభాస్కర్ బుధవారం హోం క్వారంటైన్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సేవలలో ముగ్గురు ఫిజీషియన్లు, పల్మనాలజిస్టు, నర్సింగ్ బృందం, ఆక్సిజన్ వంటి సౌకర్యాలను రోగికి కల్పిస్తారు. డాక్టర్లు ఇంటికి వెళ్లి రోగిని పరీక్షించి కావలసిన సూచనలు, సలహాలు అందజేస్తారు. రోగి కోలుకునేంత వరకు నిరంతరం వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తారు. అవసరమైన కొవిడ్ బాధితులు 6281997720, 9849545117 నెంబర్లను సంప్రదించవచ్చు.