నేడు రోశయ్య అస్థికల నిమజ్జనం

ABN , First Publish Date - 2021-12-08T05:26:49+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు.

నేడు రోశయ్య అస్థికల నిమజ్జనం
రోశయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం

 రాజమహేంద్రవరం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అస్థికలను బుధవారం గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు  రోశయ్య కుటుంబ సభ్యులు, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రత్యేక విమానంలో మధురపూడి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలసి, గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుంటారు. రోశయ్య అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు గోదావరిలో నిమజ్జనం చేస్తారు. ఉదయం 11 గంటల నుంచి 12.30 గంటల మధ్య పుష్కరఘాట్‌ వద్ద రోశయ్యకు అభిమానులు, ఆర్యవైశ్యలు, రాజకీయ నాయకులు నివాళులర్పిస్తారని ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం తెలిపారు.
చాంబర్‌ బంద్‌
మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య మృతికి సంతాపంగా బుధవారం  ఉదయం 12గంటల వరకూ రాజమహేంద్రవరంలోని అన్ని షాపులు మూసివేసి యజమానులు రోశయ్య అస్థికల నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనాలని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ర్టీస్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణజవ్వార్‌, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-12-08T05:26:49+05:30 IST