స్థిర చిత్తమే బలం...

ABN , First Publish Date - 2021-12-05T09:07:15+05:30 IST

దేనికోసమూ పాకులాడరు. అదేదో కావాలనీ ఆశించరు. వచ్చిన పదవి స్వీకరిస్తారు. ఏ పనైనా ఇష్టంగా చేస్తారు! ఇదీ రోశయ్య నైజం. వర్గాలు, లాబీయింగ్‌కు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో...

స్థిర చిత్తమే బలం...

దేనికోసమూ పాకులాడరు. అదేదో కావాలనీ ఆశించరు. వచ్చిన పదవి స్వీకరిస్తారు. ఏ పనైనా ఇష్టంగా చేస్తారు! ఇదీ రోశయ్య నైజం. వర్గాలు, లాబీయింగ్‌కు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో... అందరి వాడిగా ఉండటం, ముఖ్యమంత్రి ఎవరైనా మంత్రి పదవి లభించడం రోశయ్య ప్రత్యేకత. ఇందిర నుంచి రాహుల్‌ వరకు... ‘గాంధీ’ల కుటుంబానికి వీర విధేయుడు. రాహుల్‌ని ప్రధానిగా చూడాలనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ట్రబుల్‌ షూటర్‌గా పేరొందిన ప్రణబ్‌ ముఖర్జీకి అత్యంత సన్నిహితుడు. బతికినంత కాలం కాంగ్రెస్‌ పార్టీకి కొణిజేటి రోశయ్య వీర విధేయుడిగా వ్యవహరించారు. సహజంగా మంత్రి పదవి నుంచి తప్పించినా.. మంత్రిత్వ శాఖను మార్చినా అసంతృప్తికి లోనుకావడం, అలగడం సహజం! కానీ... రోశయ్య  వీటన్నింటికీ అతీతుడు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఎలా ఉన్నారో... ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినప్పుడూ అలాగే స్థిరంగా ఉన్నారు. ఆగ్రహం, అసంతృప్తి ఏదైనా సరే... మనసులోనే పెట్టుకున్నారు. చెప్పాల్సిన వాళ్లకు చెప్పుకున్నారు. ఈ స్థిత ప్రతజ్ఞతే సీఎంగా దిగిపోయినప్పటికీ ఆయనను తమిళనాడు రాజ్‌భవన్‌కు చేర్చింది!



Updated Date - 2021-12-05T09:07:15+05:30 IST