వరికి కుళ్లు తెగులు

ABN , First Publish Date - 2021-09-19T05:21:19+05:30 IST

వరికి కుళ్లు తెగులు

వరికి కుళ్లు తెగులు
పాగోడు వద్ద వరదనీరు వీడిన వరినాట్లుకు సోకిన కుళ్లు తెగులు

- ముంపుబారిన పడడమే కారణం

- ఆందోళనలో రైతులు

జలుమూరు : ఇటీవల కురిసిన వర్షాలకు వరినాట్లు నీటిలో మునిగిపోవడంతో వాటికి కుళ్లు తెగులు సోకింది. దీంతో  రైతు లు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడగా పాగోడు, తాళ్లవలస, గుండువలస, కూర్మనాథపురం, రామయ్యవలస, మర్రివలస, తదితర ప్రాంతాల్లో తంపర పొలాల్లో నీరు నిలిచి వరి నాట్లు కుళ్లి ఎందుకూ పనికిరాకుండా పోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద నీరు పొలాలను వీడేసరికి నాట్లు కుళ్లి వరి దుబ్బులు మావులు కొట్టి తీవ్ర నష్టం వాటిల్లిందని వారు పేర్కొంటున్నారు. పంటలను పరిశీలించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై ఏవో కె.సురేష్‌ దృష్టికి తీసుకెళ్లగా నీటమునిగిన వరి నాట్లు వరదనీరు వీడిన తక్షణమే బూస్టరు డోసు వేసుకోవాలని సూచించారు. ఒక ఎకరాకు 20 కేజీల పొటాష్‌, 15 కేజీల యూరియా బూస్టరు డోసు వేయాలని సూచించారు. అలాగే కుళ్లు తెగులు నివారణకు హెక్సాకెనాజోల్‌ 400 ఎంఎల్‌ మందును 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలన్నారు. ప్రతీ రైతు పంటల బీమా పొందేందుకు ఈక్రాప్‌ నమోదు చేయించుకోవాలని సూచించారు.



Updated Date - 2021-09-19T05:21:19+05:30 IST