Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూళ్లో టీచర్ చేతిలో దెబ్బలుతిన్న విద్యార్థి.. అందరి ముందు కొట్టారనే అవమానం భరించలేక ఏం చేశాడంటే..

ఆ కుర్రాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు.. హోంవర్క్ రాయలేదనే కారణంతో స్కూల్ టీచర్ ఆ విద్యార్థిని కొట్టారు.. స్నేహితుల ముందు టీచర్ కొట్టారనే కారణంతో ఆ విద్యార్థి ఆగ్రహానికి గురయ్యాడు.. స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్లకుండా నేరుగా బస్టాండుకు వెళ్లి బస్సెక్కేశాడు.. దీంతో తల్లిదండ్రులు, స్కూలు యాజమాన్యం ఆ బాలుడి గురించి అన్వేషణ సాగించారు.. రెండ్రోజుల అనంతరం ఆ కుర్రాడి ఆచూకీ దొరికింది.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 


థార్ ప్రాంతంలోని కపుస్తలి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలుడిని సోమవారం ఉదయం ఓ టీచర్ కొట్టారు. హోం వర్క్ సరిగ్గా చేయలేదనే కారణంతో తరగతి గదిలో దండించారు. దీంతో ఆ విద్యార్థి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా బస్టాండ్‌కు వెళ్లి ఉదయ్‌పూర్ బస్సెక్కేశాడు. దాదాపు 370 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయ్‌పూర్ బస్టాండ్‌లో దిగాడు. బస్టాండ్ పరిధిలో తిరుగుతున్న బాలుడిని ప్రేమ్ కేర్ ఫౌండేషన్ ప్రతినిధులు చూసి వివరాలు కనుక్కున్నారు. 


ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఉదయ్‌పూర్ పోలీసులు థార్ పోలీసులకు ఆ బాలుడి గురించి సమాచారం ఇచ్చారు. అలా బుధవారం సాయంత్రానికి ఆ బాలుడు తన తల్లిదండ్రులను కలుసుకున్నాడు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement