ప్రశ్నించినందుకు రౌడీషీట్‌ ఓపెన్‌

ABN , First Publish Date - 2021-11-24T04:28:40+05:30 IST

తమను ప్రశ్నించినందుకు ఓ గిరిజన ఎంపీటీసీపై కొమరారం పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ప్రశ్నించినందుకు రౌడీషీట్‌ ఓపెన్‌
ఎంపీటీసీ ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన కొమరారం పోలీసులు

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు

చీటికి మాటికి స్టేషన్‌కు రమ్మంటున్నారు: బిచ్చా, ఎంపీటీసీ

ప్రైవేట్‌ సెటిల్‌మెంట్లు చేస్తున్నందునే: సీఐ

ఇల్లెందురూరల్‌, నవంబరు 23: తమను ప్రశ్నించినందుకు ఓ గిరిజన ఎంపీటీసీపై కొమరారం పోలీసులు రౌడీషీట్‌ తెరిచారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇల్లెందు మండలం కొమరారానికి చెందిన ఆజ్మీరా బిచ్చా ఎంపీటీసీగా వ్యవహరిస్తున్నారు. సివిల్‌ పంచా యితీలు చేసే అధికారం లేదని పోలీసులను ప్రశ్నించినందుకు తనపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారని బిచ్చా వాపోతున్నారు. చీటికి మాటికి పోలీస్‌ స్టేషన్‌ రమ్మని వేధిస్తున్నారని వాపోతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తనకు పోలీసులు తగిన గౌరవం ఇచ్చారని కన్నీటి పర్యం తమవుతున్నాడు. కాగా ఈవిషయంపై గుండాల పోలీస్‌ సీఐ కరుణాకర్‌ వివరణ కోరగా కొమరారం ప్రాంతంలో ప్రైవేట్‌ సెటిల్‌మెంట్‌లు చేస్తున్న ఎంపీటీసీ బిచ్చాపై అనేక కేసులు నమోదు కావడంతోనే అతడిపై గతంలోనే రౌడీషీట్‌ ఓపెన్‌ చేశామని, స్టేషన్‌కు పిలిచినా రాకపోవడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని సీఐ తెలిపారు. పోలీసుల తీరును ఎన్డీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, రాయల చంద్రశే ఖర్‌, చండ్ర అరుణ ఖండించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ లేదని వాపోయారు.

Updated Date - 2021-11-24T04:28:40+05:30 IST