విశాఖ స్టీల్‌ను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2021-03-01T06:43:03+05:30 IST

విశాఖ స్టీల్‌ను కాపాడుకుందాం

విశాఖ స్టీల్‌ను కాపాడుకుందాం
విశాఖ స్టీల్‌ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్న అఖిలపక్ష నేతలు

విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో మరో ఉద్యమం

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో నేతల తీర్మానం

చల్లపల్లి, ఫిబ్రవరి 28 : ఎంతో మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని వివిధ పార్టీల నేతలు తీర్మానించారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి అడ్డాడ ప్రసాద్‌బాబు, రైతుసంఘం కార్యదర్శి గొరిపర్తి రామారావు అధ్యక్షతన చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాసకేంద్రంలో ఆదివారం వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 5వ తేదీన రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయడం, అంబేడ్కర్‌ విగ్రహాల ఎదుట నిరసనలు, వివిధ రూపాల్లో ఆందోళనలు, కరపత్రాల ద్వారా ప్రచారం, చలో విశాఖ తదితర కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.  ఏపీ రైతు కార్యాచరణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వంగల సుబ్బారావు, రేపల్లె యోగప్రకాష్‌, వివిధ పార్టీల నేతలు మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, మీర్‌ రిజ్వాన్‌, రాయపూడి వేణుగోపాలరావు, ఈపూరి రాంబాబు, పులేంద్రరావు, షేక్‌ నబీఘోరి, జనార్దన్‌,  రైతుసంఘం నేతలు మేకా నరసింహారావు, అట్లూరి వెంకటేశ్వరరావు, ప్రజాసంఘాల నేత సీతారామరాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:43:03+05:30 IST