Abn logo
Sep 25 2021 @ 00:29AM

రౌడీషీటర్‌ హత్య

దామోదర్‌రెడ్డి (ఫైల్‌)


ధర్మవరం, సెప్టెంబరు 24: పట్టణంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవపురం సర్కిల్లో, బ్రహ్మంగారి దేవాలయం పక్కన శుక్రవారం సాయంత్రం ఓ రౌడీషీటర్‌ను గు ర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో నరికి చంపారు. ధర్మవరం డీఎస్పీ రమాకాంత, సీఐ కరుణాకర్‌లు తెలిపిన  మేరకు... మండలంలోని వెంకటతిమ్మాపురం గ్రామానికి కేశవరెడ్డి కుమారుడు దామోదర్‌రెడ్డి(29) పదేళ్ల కిందటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి లక్ష్మీచెన్నకేశవపురంలో స్థిరపడ్డాడు. తండ్రీ కట్టెల వ్యా పారం చేస్తుండగా అన్న రమణారెడ్డి మగ్గాలను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. దామోదర్‌రెడ్డి వడ్డీవ్యాపారం నిర్వహిస్తుండేవాడు. అతనికి ఇంకా వివాహం కాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం లక్ష్మీచెన్నకేశవపురంలోని బ్రహ్మంగారి గుడి వద్దగల బండపై కూర్చొని ఉండ గా వెనుక వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు  దామోదర్‌రెడ్డి కళ్లలోకి  కారంపొడి చల్లి కత్తులు, కొడవళ్లతో నరికి హత్య చేశారు. మెడపై ఎక్కువగా నరకడంతో తలవెనుక భాగం ఛిద్రమైంది. స్థానికుల సమాచారంతో డీఎస్పీ రమాకాంత, సీఐ కరుణాకర్‌లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులతో ఆరాతీశారు. గుర్తుతెలియని వ్యక్తలు హత్యచేసి పారిపోయారని విచార ణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. కాగా హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు అర్బన పోలీ్‌సస్టేషనలో లొంగి పోయినట్టు సమాచారం. కాగా దామోదర్‌రెడ్డిపై రౌడీషీట్‌తో ఉండటంతో పాటు 2012లో భార్యాభర్తల హత్యకేసు, 2016లో బత్తలపల్లిలో హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని సీఐ తెలిపారు. ఇతడు లక్ష్మీ చెన్నకేశవపురంలో వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు.  నిందితులు  కూడా వడ్డీ వ్యాపారం చేసుకుంటుండగా వారితో తరచూ గొడవ పడుతూ ఇక్క డ వడ్డీ వ్యాపారం చేయరా దని హుకుం జారీ చేసేవాడన్నారు. తాను మూడు హత్యలు చేసి వచ్చానని వడ్డీవ్యాపారం చేస్తే అంతు చూస్తానని తరచూ బెదిరించేవాడని సీఐ పేర్కొన్నారు. ఓ వడ్డీ వ్యాపారంలో దాదాపు రూ.3 లక్షలదాకా వేరేవాళ్లకు ఇవ్వకుండా దామోదర్‌రెడ్డి అడ్డుపడి వారికి నష్టం కల్గించారని, దీంతో విసుగుచెందిన నిందితులు ఈ హత్యకు పాల్పడినట్టు అంగీకరించారన్నారు. మృతుడి తండ్రి కేశవరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.