రైల్లో 15 ఏళ్ల బాలిక ఒంటరి ప్రయాణం.. టెన్షన్‌గా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆరా తీస్తే ఆమె చెప్పింది విని..

ABN , First Publish Date - 2021-07-12T21:52:40+05:30 IST

ఆ బాలిక ఏదో ప్రమాదంలో ఉందని గమనించిన పోలీసులు ఆరా తీశారు.. ఆమె చెప్పింది విని వారి కళ్లు చెమర్చాయి..

రైల్లో 15 ఏళ్ల బాలిక ఒంటరి ప్రయాణం.. టెన్షన్‌గా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆరా తీస్తే ఆమె చెప్పింది విని..

బెంగళూరులోని సంఘమిత్ర స్పెషల్ ఎక్స్‌ప్రెస్.. తమ రెగ్యులర్ విధుల్లో భాగంగా రైల్లో చెకింగ్ చేస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. వారికి ఆ ట్రైన్‌లో ఒంటరిగా 15 ఏళ్ల బాలిక కనిపించింది.. భయంభయంగా చూస్తోంది.. ఆ బాలిక ఏదో ప్రమాదంలో ఉందని గమనించిన పోలీసులు ఆరా తీశారు.. ఆమె చెప్పింది విని వారి కళ్లు చెమర్చాయి.. బెంగళూరుకు సమీపంలోని బంగారపేట్ జంక్షన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. 


రైళ్లో ఒంటరిగా కనిపించి తమను సహాయం అడిగిన బాలికను రక్షించిన పోలీసులు ఆమెను విచారించారు. తనది బీహార్‌లోని తూర్పు చంపారన్‌లోని మోతిహరి ప్రాంతమని, తండ్రి తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడడంతోపాటు తనకు నచ్చని వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేశాడని తెలిపింది. `నాపై తండ్రి చేస్తున్న అత్యాచారాల గురించి మా అమ్మకు తెలుసు. అయినా పట్టించుకోలేదు. తండ్రి ఫిక్స్ చేసిన పెళ్లికి ఆమె కూడా వత్తాసు పలుకుతోంది. అందుకే నెల క్రితం ఇంటి నుంచి తప్పించుకుని బెంగళూరు వచ్చాను. 


ఒంటరిగా ఉన్న నేను అమ్మాయిలను అక్రమంగా రవాణా చేసే ముఠాకు చిక్కాను. వారు నన్ను  వారం పాటు ఓ చీకటి గదిలో బంధించారు. నాకు మద్యం, మత్తు పదార్థాలు ఇచ్చారు. ఈ రోజు వేరే ప్రాంతానికి రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నాన`ని చెప్పింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి కొన్ని పరీక్షలు చేయించిన పోలీసులు చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రులపై పోస్కో చట్టం ప్రకారం చర్యలు తీసుంటామని పోలీస్ అధికారి చెప్పారు. అలాగే సదరు ముఠా గురించి తీవ్రంగా గాలింపులు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.  

Updated Date - 2021-07-12T21:52:40+05:30 IST