Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్‌ఆర్‌డీఎస్‌ కార్యక్రమాలు జిల్లాకే ఆదర్శం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, డిసెంబరు 6 : గ్రామస్తులందరూ కలిసి రాజకీ యాలకతీతంగా ఆర్‌ఆర్‌డీఎస్‌ ద్వారా గ్రామాభివృద్ధికి అవసరమైనవిద్య, వైద్యం తదితరమౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం ద్వారా జిల్లాకే ఆదర్శంగా నిలచారని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి అభినందించారు. రంగన్నగూడెం రూరల్‌ డవలపమెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి ఆధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీపెట్‌లో ర్యాంకు సాధించిన కనకవల్లి సందీప్‌కు ఆర్‌ఆర్‌డీఎస్‌ అందిం చిన మొదటి సెమిస్టర్‌ ట్యూషన్‌ ఫీజు రూ. 27 వేలను, ఎంపీపీ స్కూల్‌కు గ్రీన్‌ చాక్‌ బోర్డును ఆయన అందజేశారు. గ్రామాభివృద్దికి ఎన్నారైల సహకారంతో చేస్తున్న వివిధ సేవలను ఆర్‌ఆర్‌డీఎస్‌ కార్యదర్శి ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు వివరించారు. తానా కో- ఆర్డినేటర్‌ కసుకుర్తి రాజా మాట్లాడుతూ తన సహ విద్యార్థి కనకవల్లి శేషగిరిరావు కుమారుడు సందీప్‌కు మిగతా సెమిస్టర్‌ ఫీజులను తానే చెల్లిస్తానని, ఎంపీయూపీ స్కూల్‌కు 50 వేల విలువైన పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 20 ఏళ్లుగా గ్రామాభివృద్దికి కృషి చేస్తున్న ఆర్‌ఆర్‌డీఎస్‌ సేవలు స్ఫూర్తిదాయకమని అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సీఈవో కాకాని తరుణ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ, ఆర్‌ఆర్‌డీఎస్‌ అధ్యక్షుడు తుమ్మల దశరధరామయ్య, పాల సొసైటీ అధ్యక్షుడు మొవ్వా శ్రీనివాస రావు, కార్యదర్శులు ఆంజనేయులు, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement