Advertisement

'RRR': “ఐటమ్ సాంగ్ ఉందా మావా ?” మేకర్స్‌కు ఫన్నీ క్వశ్చన్..

'ఆర్ఆర్ఆర్' మూవీ మేకర్స్‌కు ఓ నెటిజన్ ఫన్నీ క్వశ్చన్ వేశాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ మొదలయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా నటించిన ఇందులో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేబగణ్, ఓలివియా మోరిస్, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 10 భాషలలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టి తాజాగా 'జనని' అనే ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్ఠిస్తోంది. ఇక ఈ సాంగ్ రిలీజ్ సందర్భంగా ఓ నెటిజన్, ‘ఆర్ఆర్ఆర్’ టీంకు  మధ్య సోషల్ మీడియాలో సరదా సంభాషణ జరిగింది. "ఐటమ్ సాంగ్ ఉందా మావా ?" అంటూ ‘ఆర్ఆర్ఆర్’ టీంను నెటిజన్ ట్యాగ్ చేశాడు. అంతేకాదు, దానికి స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఫోటోను జత చేశాడు. దీనికి ‘ఆర్ఆర్ఆర్’ మేకర్స్ కూడా అంతే సరదాగా ‘ఏ నువ్వు చేస్తావా ?” అంటూ ప్రశ్నించారు. వీళ్ళు కూడా దానికి బ్రహ్మానందం ఫన్నీ ఎక్స్‌ప్రెషన్‌ను జోడించారు. ప్రస్తుతం నెటిజన్, ‘ఆర్ఆర్ఆర్’ టీం మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 


Advertisement