Oct 14 2021 @ 17:38PM

RRR : దీపావళికి టీజర్ ట్రీట్?

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అత్యంత భారీగా రూపొందుతోన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానుంది.  ఇప్పటికే విడుదలైన తారక్, చెర్రీ టీజర్స్, దోస్తీ సాంగ్  అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. జనవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన  ప్రచారం లో భాగంగా .. మరో ట్రీట్ ను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు జక్క,న్న అండ్ టీమ్. ఇప్పటి వరకూ ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి సంబంధించి హీరోల ఇండివిడ్యువల్ టీజర్స్ మాత్రమే విడుదలయ్యాయి. అయితే ఈ సారి ఈ ఇద్దరూ కలిసున్న ఓ బ్రహ్మాండమైన టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. 

ఈ టీజర్  దీపావళి కానకగా విడుదల చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.  క్లాసిక్ హాలీవుడ్ మూవీ ‘మోటార్ సైకిల్ డైరీస్’ స్ఫూర్తితో రూపొందుతోన్న ఈ సినిమాకి  యన్టీఆర్, తారక్... మోటార్ సైకిల్ మీద విహరించే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ ను కట్ చేయాలని చూస్తున్నారట. అలాగే.. అదే టీజర్ లో ఇద్దరు హీరోయిన్స్ ను కూడా రివీల్ చేస్తారట. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.  మరి దీపావళి నాడు రాబోయే ‘ఆర్.ఆర్.ఆర్’ టీజర్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.