Oct 27 2021 @ 07:50AM

RRR: దుబాయ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.


ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం త్వరలో స్టార్ట్ చేయబోతున్నారట. ఇందులో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో దుబాయ్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ లేనప్పటికీ ఈవెంట్ అక్కడే ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం టాక్ గట్టిగానే వినిపిస్తుంది. చూడాలి మరి జక్కన్న బృందం దీనిపై ఎప్పుడు అప్‌డేట్ ఇస్తారో. కాగా పోరాట యోధులు కొమురమ్ భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన విషయం తెలిసిందే.