Jul 20 2021 @ 15:17PM

‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్‌డేట్‌

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడిగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. భారీ అంచనాల‌తో సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ఆగిన ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఇది వరకే రెండు పాటలు మినహా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు జక్కన్న ఓ ప్రమోషనల్ సాంగ్‌ను సోమ‌వారం నుంచి హైద‌రాబాద్‌లో చిత్రీక‌రిస్తున్నారు. సినిమాలోని ప్ర‌ధాన తారాగ‌ణమంతా ఈ సాంగ్‌లో పాల్గొంటున్నారు. ఈ పాట కోసం రెండు భారీ సెట్స్‌ను వేయ‌డం విశేషం. ఇది వ‌ర‌కే  ‘ఆర్ఆర్ఆర్‌’ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇంకా స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ సన్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి ఇలా బాలీవుడ్‌, హాలీవుడ్ తార‌ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది.