Abn logo
Jul 2 2020 @ 14:47PM

`ఆచార్య`కు లైన్ క్లియర్ చేసిన `ఆర్ఆర్ఆర్`?

ప్రభుత్వం నుంచి అనుమతులు లభించిన వెంటనే `ఆర్ఆర్ఆర్` సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని దర్శకుడు రాజమౌళి భావించారు. అనుకున్నట్టుగానే ప్రభుత్వం షూటింగ్‌లకు అనుమతులిచ్చింది. అయితే ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడం, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం వంటి కారణాలతో `ఆర్ఆర్ఆర్` షూటింగ్‌ను రాజమౌళి వాయిదా వేశారట. సినిమాను వచ్చే ఏడాది దసరా నాటికి సిద్ధం చేయాలనుకుంటున్నారట. 


`ఆర్ఆర్ఆర్` వాయిదా పడడంతో మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`కు లైన్ క్లియర్ అయిందట. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చెర్రీ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నందువల్ల `ఆర్ఆర్ఆర్`కు డేట్లు కేటాయించడం కుదరలేదు. ఇప్పుడు `ఆర్ఆర్ఆర్` వాయిదా పడినందువల్ల ముందుగా `ఆచార్య`ను పూర్తి చేయాలని చెర్రీ అనుకుంటున్నాడట.  

Advertisement
Advertisement
Advertisement