Abn logo
Oct 24 2020 @ 03:40AM

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీజర్‌పై ఆదివాసీల ఆగ్రహం

Kaakateeya

మనోభావాలను దెబ్బతీసేలా ఉంది

తక్షణమే సన్నివేశాలు తొలగించాలి

కుమ్రం భీం యువసేన డిమాండ్‌


ఉట్నూర్‌, అక్టోబరు 23: దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా టీజర్‌లో గోండు వీరుడు కుమ్రం భీం ముస్లింటోపీ ధరించినట్లు చిత్రీకరించడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కుమ్రంభీం ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి కుమ్రంభీం యువసేన నాయకులు శుక్రవారం క్షీరాభిషేకం చేసి నిరసన తెలిపారు. కుమ్రం భీంకు టోపీ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యువసేన జిల్లా అధ్యక్షుడు పెందూర్‌ ప్రభాకర్‌ అన్నారు. నాడు నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా పోరాడిన కుమ్రం భీం చరిత్రను పూర్తిగా అర్థంచేసుకొని సినిమా తీయాలని రాజమౌళికి ఆయన హితవు పలికారు. గిరిజనుల మనోభావాలను దెబ్బతీయడం సరైంది కాదన్నారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాజమౌళిని హెచ్చరించారు.

Advertisement
Advertisement