‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ వచ్చేది ఎప్పుడంటే..!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ట్రైలర్‌ను ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అయితే ప్రముఖ సినీ గేయ రచయిత సీతారామశాస్ర్తి మరణంతోపాటు పలు సాంకేతిక కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా పడింది.  ఈ నెల 9న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సోషల్‌ మీడియాలోనే కాకుండా అదే రోజు ఉదయం 10గంటలకు థియేటర్స్‌లోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ‘‘తారక్‌, రామ్‌ చరణ్‌ ట్వీట్‌ చేశారు. భారతదేశంలో అతిపెద్ద యాక్షన్‌ డ్రామా స్నీక్‌పీక్‌ చూసేందుకు సిద్ధంకండి’’ అని హీరోలిద్దరూ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇందులో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియాభట్‌, ఒలివియా మోరీస్‌ కథానాయికలు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Advertisement