'RRR': ట్రైలర్ డ్యూరేషన్ ఎంతంటే..!

'ఆర్ఆర్ఆర్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా రిలీజ్‌కు సిద్దమవుతోంది. 2022, జనవరి7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్‌ను రాజమౌళి బృందం మొదలుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 2వ వారంలో రిలీజ్ చేయబోతున్నట్టు తాజా సమాచారం. కాగా, ఈ ట్రైలర్ కటింగ్ మూడు నిమిషాలకు పైగా ఉంటుందని ఓ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రాజమౌళి స్ట్రాటజీ ప్రకారమే సినిమాపై అసాధారణమైన అంచనాలు పెంచేందుకు ఇలా మూడు నిమిషాల ట్రైలర్‌ను వదలబోతున్నారట. దీనిపై త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. ఇక ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్, సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్, శ్రియ శరణ్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు కథ విజయేంద్ర ప్రసాద్, సంగీతం ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ కె కె సెంథిల్ కుమార్ అందిస్తున్నారు.  

Advertisement
Advertisement