ఆవ భూముల్లో రూ.100 కోట్ల స్కామ్‌: జ్యోతుల నెహ్రూ

ABN , First Publish Date - 2020-06-05T19:47:16+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో..

ఆవ భూముల్లో రూ.100 కోట్ల స్కామ్‌: జ్యోతుల నెహ్రూ

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఆవ భూముల ధర చాలా తక్కువగా ఉన్నా.. పైగా అది ముంపుప్రాంతం అయినా ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిందని విమర్శించారు. సుమారు రూ. వంద కోట్లు చేతుల మార్పిడి జరుతున్నపరిస్థితి ఉందన్నారు. నిజనిర్ధారణ కమిటీ ద్వారా తాము అక్కడికి వెళ్లి పరిశీలించామని, రైతులతో కూడా మాట్లాడామని.. అసలు భూమి ధర ఎంత ఉన్నది వారు చెప్పార్నారు.


ఆవ భూములు అసలు ఇళ్ల నిర్మాణాలకు పనికిరావని జ్యోతుల నెహ్రూ అన్నారు. అక్కడ మార్కెట్ ధర ఎకరా రూ. 15 లక్షలు ఉంటే ప్రభుత్వం రూ. 45 లక్షలకు కొనుగోలు చేస్తుందన్నారు. అక్కడ మొత్తం 570 ఎకరాలు ఉండగా అందులో 74 ఎకరాలు 36 మంది రైతులకు సంబంధించిన భూమి ఉందని, వైసీపీ నేతలు వాళ్లతో ఒప్పందం కుదుర్చుకుని రూ. 20 లక్షలు వాళ్లకు ఇవ్వడానికి, మరో రూ. 25 లక్షలు వైసీపీ నేతలు, డిపార్టుమెంట్‌కు ఇవ్వడానికి ఒక ఒప్పందం ప్రకారం జరిగిందన్నారు. అయితే దీనిపై కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం ప్రస్తుతం ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. 


Updated Date - 2020-06-05T19:47:16+05:30 IST