రూ. 124 కోట్లు... 55 శాతం... డేటా వర్క్జ్‌... నజారా టెక్‌ హస్తగతం...

ABN , First Publish Date - 2022-01-18T20:43:31+05:30 IST

పోగ్రామాటిక్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మానిటైజేషన్‌ కంపెనీ డేటావర్క్జ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్‌ ప్రకటించింది. మొత్తం 55 శాతం వాటా కొనుగోలు కోసం రూ. 124 కోట్లను వెచ్చించినట్లు వెల్లడించింది.

రూ. 124 కోట్లు... 55 శాతం... డేటా వర్క్జ్‌... నజారా టెక్‌ హస్తగతం...

హైదరాబాద్ : పోగ్రామాటిక్‌ అడ్వర్టైజింగ్‌ అండ్‌ మానిటైజేషన్‌ కంపెనీ డేటావర్క్జ్‌లో వాటాను కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్‌ ప్రకటించింది. మొత్తం 55 శాతం వాటా కొనుగోలు కోసం రూ. 124 కోట్లను వెచ్చించినట్లు వెల్లడించింది. డేటా వర్క్జ్‌ వాల్యూను రూ. 225 కోట్లుగా లెక్కకట్టారు. సంస్థలో మొదటి దశలో 33 శాతం వాటాను నజారా టెక్నాలజీస్‌ కొనుగోలు చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదటి లావాదేవీ పూర్తయ్యే అవకాశముందని కంపెనీ ప్రకటించింది. ఇక రెండో దశలో అదనంగా మరో 22 శాతం వాటాను నజారా టెక్నాలజీస్‌ కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశముందని కంపెనీ భావిస్తోంది. 


టేకోవర్‌ వార్తలతో ఈ రోజు నజారా టెక్నాలజీస్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. ఒకదశలో షేర్‌ ధర దాదాపు 4 శాతం నష్టపోయి, రూ. 2360 కు పడిపోయింది. ప్రస్తుతం ఒకశాతానికి పైగా నష్టంతో రూ. 2,425 వద్ద షేర్‌ ట్రేడవుతోంది. ఈ రోజు ఇప్పటివరకు ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 38 వేల షేర్లు ట్రేడయ్యాయి. ఇక కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ విషయానికొస్తే రూ. 7,910 కోట్లకు పడిపోవడం గమనార్హం. 

Updated Date - 2022-01-18T20:43:31+05:30 IST