రూ.17 లక్షల ఖరీదైన తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-09-18T06:12:25+05:30 IST

తెలంగాణ రాష్ట్రం నుంచి గుట్టుగా మద్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను స్పెషల్‌ ఎనఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

రూ.17 లక్షల ఖరీదైన తెలంగాణ మద్యం స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఈబీ జేడీ బిందుమాధవ్‌, పక్కన అధికారులు, అన్నపూర్ణ, మణికంఠ, వెనుక నిందితులు

ఇద్దరు నిందితుల అరెస్టు.. పరారీలో మరొకరు

గుంటూరు, సెప్టెంబరు 17 తెలంగాణ రాష్ట్రం నుంచి గుట్టుగా మద్యాన్ని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను స్పెషల్‌ ఎనఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.17,28,320 ఖరీదైన 1,428 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నర్రా అశోక్‌, చెన్నారెడ్డి వెంకటరమణ అనే ఇద్దరిని అరెస్టు చేయగా మేడా సంపతకుమార్‌ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సీహెచ బిందుమాధవ్‌ తెలిపారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితులను, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మీడియా ఎదుట హాజరుపరచి వివరాలు వెల్లడించారు. వినుకొండ ప్రాంతానికి చెందిన నర్రా అశోక్‌ నగరంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదివాడు. తన స్నేహితుడైన చెన్నారెడ్డి వెంకటరమణతో కలిసి  అక్రమంగా మద్యాన్ని తరలించాడు.  వీటిని పలకలూరు రోడ్డులోని అశోక్‌ అద్దెకు తీసుకున్న ఇంటిలో నిల్వ ఉంచారు.   ఎస్‌ఈబీ జాయింట్‌ డైరెక్టర్‌ సీహెచ బిందుమాధవ్‌కు అందిన సమాచారం మేరకు స్పెషల్‌ టీం ఆ ఇంటిపై దాడి చేసి మద్యాన్ని సీజ్‌ చేశారు. కేసు చేధించిన అధికారులు, సిబ్బందికి అర్బన ఎస్పీ రివార్డులు ప్రకటించినట్టు జేడీ బిందుమాధవ్‌ తెలిపారు. సమావేశంలో ఎనఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ, ఎనఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ మణికంఠతోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T06:12:25+05:30 IST